43
1 ✽నాకు న్యాయం చేకూర్చు✽, దేవా!భక్తిలేని ఈ ప్రజతో నా పక్షంగా వాదించు.
మోసం, దౌర్జన్యం చేసేవారి నుంచి నన్ను విడిపించు.
2 నీవే నా బలానివి✽. నా దేవుడవు.
నన్ను ఎందుకిలా నిరాకరించావు?
శత్రువులు నన్ను అణగదొక్కుతూ ఉంటే
శోకమూర్తినై✽ నేనెందుకు ఇలా వెళ్ళాలి?
3 ✽నీ వెలుగు, నీ సత్యం పంపించు.
అవే నాకు దారి చూపుతూ నీ పవిత్ర పర్వతానికీ
నీ ఆలయానికీ నన్ను చేరుస్తాయి.
4 ✽అప్పుడు నేను దేవుని బలిపీఠాన్ని సమీపిస్తాను.
నా దేవుని దగ్గరికి వెళ్తాను.
ఆయనే నాకు అధిక సంతోషం.
దేవా! నా దేవా! తంతివాద్యం వాయిస్తూ,
నిన్ను స్తుతిస్తాను.
5 మనసా, నీవెందుకు ఇలా కుంగిపోతావు?
నాలో నీవెందుకు ఇలా ఘోషిస్తావు?
దేవునిమీద ఆశాభావం ఉంచు.
ఆయనే నా రక్షణ, నా దేవుడు.
ఇంకా ఆయనను స్తుతిస్తాను.