దావీదు రాసిన మిఖ్తామ్
16
1 ✽దేవా! నిన్ను నమ్మి ఆశ్రయించాను.నన్ను కాపాడు.
2 ✽“నీవే నా యజమానివి.
నీ మూలంగానే నా క్షేమమంతా”
అని నేను యెహోవాతో అన్నాను.
3 ✽ఈ భూమి మీద నివసించే నీ పవిత్ర ప్రజలే
మహనీయులు.
వారి విషయంలోనే నాకు సంతోషం.
4 ✽యెహోవా తప్ప వేరే దేవుళ్ళను అనుసరించేవారికి
కడగండ్లు ఎక్కువవుతాయి.
వాళ్ళు రక్తం పానార్పణగా అర్పించేటప్పుడు
నేను పాల్గొనను.
వాళ్ళ దేవుళ్ళ పేర్లు కూడా నా పెదవులతో
ఉచ్చరించను.
5 ✽యెహోవా నాకు వచ్చిన వంతు, నా అన్నపానాలు!
నీవు నాకు పంచి పెట్టినదానిని నిర్వహిస్తావు.
6 మనోహరమైన స్థలాలలో నాకు భాగం లభించింది.
నా వారసత్వం చాలా శ్రేష్ఠమైనది.
7 ✽యెహోవా నాకు ఆలోచన చెప్పేవాడు.
ఆయనను స్తుతిస్తాను.
రాత్రిలో కూడా నా అంతరాత్మ నాకు
ఉపదేశిస్తుంది.
8 ✽యెహోవా వైపే నేనెప్పుడూ చూస్తూ ఉన్నాను.
ఆయన నా కుడివైపున ఉన్నాడు.
గనుక ఏదీ నన్ను కదల్చదు.
9 ✽అందుచేత నా హృదయం ఉల్లాసంగా ఉంది.
నా నాలుక నా ఆనందాన్ని బయలు పరుస్తున్నది.
నా శరీరం కూడా క్షేమంగా ఉంటుంది✽.
10 ఎందుకంటే నీవు నా ఆత్మను మృత్యులోకం✽లో
జారవిడువవు.
నీ పవిత్రుడైన నన్ను కుళ్ళి పోనియ్యవు.
11 ✽జీవ పథం నీవు నాకు చూపుతావు.
నీ సన్నిధానంలో ఆనంద సమృద్ధి ఉంది.
నీ కుడిచేతిలో శాశ్వత సంతోషాలు ఉన్నాయి.