దావీదు కీర్తన
15
1 యెహోవా, నీ గుడారంలో
ఉండతగినవాడెవడు?
నీ పవిత్ర పర్వతం మీద నివసించడానికి
యోగ్యుడెవడు?
2 హృదయ పూర్వకంగా సత్యం చెపుతూ,
నిజాయితీ, సత్‌ప్రవర్తన గలవాడే.
3 అలాంటివాడి నాలుక అపనిందలు ప్రచారం
చెయ్యదు.
అతడు తన పొరుగువాడికి కీడు జరిగించడు.
ప్రక్క వాడిమీద అభాండాలు వెయ్యడు.
4 నీచుడంటే అతడికి అసహ్యం గానీ
యెహోవా అంటే భయభక్తులున్న వారిని
అతడు గౌరవిస్తాడు.
తనకు నష్టం వాటిల్లినా సరే, ఆడినమాట తప్పడు.
5 డబ్బు అప్పిచ్చి వడ్డీ వసూలు చెయ్యడు.
నిర్దోషులకు వ్యతిరేకంగా నిలబడడానికి
లంచం తీసుకోడు.
ఈ విధంగా ప్రవర్తించే వ్యక్తిని ఏదీ కదల్చదు.