గాయకుల నాయకుడికి. దావీదుకీర్తన.
11
1 ✽యెహోవాను నమ్మి ఆశ్రయించాను.మీరు నన్ను చూచి “పక్షిలాగా నీ కొండమీదికి పారిపో!
2 అరుగో, దుర్మార్గులు విల్లెక్కు పెట్టారు!
దొంగచాటుగా యథార్థవంతుల మీద
బాణం వెయ్యాలని
ధనుస్సును సంధించారు!
3 ✽పునాదులు నాశనమవుతూ ఉంటే న్యాయవంతులు
చేయగలిగినదేమిటి?” అని
ఎలా అంటారో అనండి.
4 ✽యెహోవా తన పవిత్రాలయంలో ఉన్నాడు.
యెహోవా సింహాసనం పరలోకంలో ఉంది.
మనుషులను ఆయన చూస్తూ ఉన్నాడు.
ఆయన చూపులు వాళ్ళను పరీక్షిస్తున్నాయి.
5 యెహోవా న్యాయవంతులను పరీక్షిస్తాడు✽.
దౌర్జన్యం అంటే ఇష్టమున్నవాళ్ళనూ,
దుర్మార్గులనూ ఆయన ద్వేషిస్తాడు✽.
6 ✝దుర్మార్గుల మీద ఆయన నిప్పుకణాలు
వర్షించేలా చేస్తాడు.
అగ్ని గంధకాలు, వడగాలి వాళ్ళ
పాన పాత్రలోని పదార్థాలు.
7 ✽యెహోవా న్యాయవంతుడు.
ఆయనకు న్యాయమంటే ఎంతో ఇష్టం.
యథార్థవంతులకు ఆయన ముఖ దర్శనం
కలుగుతుంది.