గాయకుల నాయకుడికి. అష్టమశ్రుతి మీద తంతివాద్యాలతో పాడతగ్గది. దావీదు కీర్తన.
6
1 ✽యెహోవా, కోపించి నన్ను శిక్షించకు.ఆగ్రహించి నన్ను దండించకు.
2 ✽యెహోవా, నా మీద దయ చూపు;
నేను నీరసించిపొయ్యాను.
యెహోవా, నాకు ఎముకల్లో బాధగా ఉంది.
నా మనసులో ఎంతో వేదన ఉంది.
నాకు ఆరోగ్యం ప్రసాదించు.
3 యెహోవా, ఎంతకాలమని✽ నీవిలా ఊరుకొంటావు?
4 యెహోవా, మళ్ళీ రా! నాకు విముక్తి ప్రసాదించు.
నీ వాత్సల్యంతో నన్ను రక్షించు.
5 ✽చనిపోయిన వాళ్ళకు నీ గురించి జ్ఞాపకం ఉండదు.
మృత్యులోకంలో నీకు కృతజ్ఞత అర్పించేదెవరు?
6 ✽నేను మూలిగి మూలిగి నీరసించిపోయాను.
రాత్రంతా నా కన్నీళ్ళతో నా పరుపు నానిపోతుంది.
నా బాష్పాలతో నా పడక మునిగిపోతుంది.
7 శోకంతో నా కళ్ళు గుంటలు పడుతున్నాయి.
నా శత్రువుల మూలంగా నా కళ్ళు క్షీణించాయి.
8 ✽నా ఏడుపు యెహోవా ఆలకించాడు.
దుర్మార్గులైన మీరంతా నాదగ్గర నుంచి పోండి!
9 యెహోవా నా విన్నపం ఆలకించాడు.
యెహోవా నా ప్రార్థన అంగీకరిస్తున్నాడు.
10 నా శత్రువులంతా సిగ్గుపాలవుతారు.
వాళ్ళు భయంతో గడగడ వణుకుతారు.
వాళ్ళు ఆకస్మికంగా వెనక్కు తిరిగి సిగ్గుపాలవుతారు.