అబ్‌షాలోం అనే తన కొడుకు బారినుండి పారిపోయి దావీదు ఈ కీర్తన వ్రాశాడు.
3
1 ✽✝యెహోవా, నాకు విరోధులెందరో ఉన్నారు!నాకు వ్యతిరేకంగా నిలబడేవాళ్ళెందరో!
2 ✝“దేవుని మూలంగా అతడికేమీ రక్షణ దొరకదు”
అంటూ అనేక మంది నా గురించి
అంటున్నారు. (సెలా✽)
3 ✽కాని, యెహోవా! నీవు నాకు డాలులాంటివాడవు.
నీవే నాకు ఘనత.
నేను తలెత్తుకొనేలా చేసేవాడవు నీవే.
4 ✽నేను గొంతెత్తి యెహోవాకు మొర పెట్టేటప్పుడు
ఆయన తన పవిత్ర పర్వతం నుంచి
జవాబిస్తాడు. (సెలా)
5 ✽యెహోవా నాకు అండగా ఉండడం చేత నేను
పడుకొన్నాను, నిద్రపోయి లేచాను.
6 వేలాది వేలమంది శత్రువులు వచ్చి నన్ను
చుట్టుముట్టారు గానీ నాకేమీ భయం లేదు.
7 ✽ యెహోవా, లే! నా దేవా! నన్ను రక్షించు.
నీవు నా శత్రువులందరి దవడ ఎముక
విరగకొట్టేవాడవు.
దుర్మార్గుల పళ్ళు రాలగొట్టేవాడవు.
8 ✝రక్షించేది యెహోవాయే, నీ ప్రజమీద
నీ ఆశీస్సులు ఉంటాయి గాక! (సెలా)