25
1 ✽అప్పుడు షూహియావాడు బిల్దదు ఈ విధంగా జవాబిచ్చాడు: 2 “ఆధిపత్యం, బీకరత్వం ఆయనకు చెందుతాయి. తన పరమ ప్రదేశాలలో ఆయన శాంతి సుస్థిరం చేస్తాడు.3 ఆయన సేనలెన్నో లెక్క పెట్టడం ఎవరికి చేతనవుతుంది? ఆయన వెలుగు ఎవరిమీద అయినా ఉదయించకుండా ఉంటుందా?
4 మరి, దేవుని ఎదుట మనిషి నిర్దోషి ఎలా కాగలడు? స్త్రీ గర్భాన పుట్టినవాడు శుద్ధుడు ఎలా అవుతాడు?
5 ఆయన దృష్టిలో చంద్రగోళానికి కాంతి లేదు. నక్షత్రాలు శుద్ధమైనవి కావు.
6 అలాంటప్పుడు పురుగులాంటి మానవుడు, కీటకంవంటి మనిషి ఆయన దృష్టిలో అసలే శుద్ధుడు కాలేడు!