2
1 ✝✝బబులోను చక్రవర్తి నెబుకద్‌నెజరు బందీలుగా తీసుకుపోయినవారి సంతానం అనేకులు బబులోను దేశంలో చెరనుంచి జెరుసలంకు, యూదా దేశానికి, ఎవరి ఊరికి వారు తిరిగి వచ్చారు. 2 వారిలో జెరుబ్బాబెల్, యేషూవ✽, నెహెమ్యా✽, శెరయా, రేలాయా, మొర్‌దెకయి✽, బిల్‌షాను, మిస్‌పారు, బిగ్‌వయి, రెహూం, బయనా ఉన్నారు.బబులోనునుంచి వచ్చిన ఇస్రాయేల్ ప్రజల లెక్క ఇది: 3 పరోషు వంశంవారు రెండు వేల నూట డెబ్భైఇద్దరు; 4 షెఫట్యా వంశంవారు ఏడు వందల డెబ్భైఇద్దరు; 5 ఆరహు వంశం వారు ఏడు వందల డెబ్భై అయిదుగురు. 6 యేషూవ, యోవాబుల వంశాలలో పహత్‌మోయాబు కుటుంబంవారు రెండు వేల ఎనిమిది వందల పన్నెండుమంది; 7 ఏలాం వంశంవారు వెయ్యి రెండు వందల యాభై నలుగురు; 8 జత్తూ వంశంవారు తొమ్మిది వందల నలభై ఐదుగురు; 9 జక్కయి వంశంవారు ఏడు వందల అరవైమంది; 10 బానీ వంశంవారు ఆరు వందల నలభై ఇద్దరు; 11 బేబయి వంశంవారు ఆరు వందల ఇరవై ముగ్గురు; 12 అజెగదు వంశంవారు వెయ్యి రెండు వందల ఇరవై ఇద్దరు; 13 అదొనీకాం వంశంవారు ఆరు వందల అరవై ఆరుమంది; 14 బిగ్‌వయి వంశంవారు రెండు వేల యాభై ఆరుమంది; 15 అదీను వంశం వారు నాలుగు వందల యాభై నలుగురు; 16 హిజ్కియా వంశంలో అటేరు కుటుంబంవారు తొంభై ఎనిమిది మంది; 17 బెజయి వంశంవారు మూడు వందల ఇరవై ముగ్గురు; 18 యోరా వంశంవారు నూట పన్నెండు మంది; 19 హాషుం వంశంవారు రెండు వందల ఇరవై ముగ్గురు. 20 గిబ్బారు వంశంవారు తొంభై అయిదుమంది. 21 బేత్‌లెహేంకు చెందిన వంశాలవారు నూట ఇరవై ముగ్గురు; 22 నెటోపా గ్రామం వారు యాభై ఆరుమంది; 23 అనాతోతు గ్రామం వారు నూట ఇరవై ఎనిమిది మంది; 24 అజ్‌మావెతు గ్రామం వారు నలభై ఇద్దరు; 25 కిర్యత్‌యారీం, కెఫీరా, బేరోతు గ్రామాలవారు ఏడువందల నలభై ముగ్గురు; 26 రమా, గెబ గ్రామాల వారు ఆరు వందల ఇరవై ఒక్కరు; 27 మిక్‌మషు గ్రామం వారు నూట ఇరవై ఇద్దరు; 28 బేతేల్, హాయీ గ్రామాల వారు రెండు వందల ఇరవై ముగ్గురు; 29 నెబో గ్రామం వారు యాభై ఇద్దరు; 30 మగ్‌బీషు గ్రామం వారు నూట యాభై ఆరు మంది; 31 ఇంకొక ఏలాం గ్రామం వారు వెయ్యి రెండు వందల యాభై నలుగురు; 32 హారీం గ్రామం వారు మూడు వందల ఇరవై మంది; 33 లోద్, హదీద్, ఓనో గ్రామాల వారు ఏడు వందల ఇరవై అయిదుమంది; 34 యెరికో పట్టణం వారు మూడు వందల నలభై అయిదు మంది; 35 సెనాయా ఊరి వారు మూడు వేల ఆరు వందల ముప్ఫయిమంది.
36 యాజుల లెక్క: యెదాయా వంశంలో యేషూవ కుటుంబంవారు తొమ్మిది వందల డెబ్భై ముగ్గురు; 37 ఇమ్మేరు వంశంవారు వెయ్యి యాభై ఇద్దరు; 38 పషూరు వంశంవారు వెయ్యి రెండు వందల నలభై ఏడు మంది. 39 హరీం వంశం వారు వెయ్యి పదిహేడు మంది. 40 ✽లేవీగోత్రికులు లెక్క: హోదవ్యా వంశంలో యేషూవ, కద్‌మీయేల్ అనే వారి కుటుంబాలవారు డెబ్భై నలుగురు. 41 గాయకుల లెక్క: ఆసాపు✽ వంశంవారు నూట ఇరవై ఎనిమిదిమంది. 42 ద్వారపాలకులె✽వరంటే, షల్లూం, అటేరు, టల్‌మోను, అక్కూబ్, హటీటా, షోబయి అనే వారి వంశీయులు నూట ముప్ఫయి తొమ్మిదిమంది.
43 దేవాలయ సేవకులు వీరు: జీహా, హశూపా, టబ్బాయోతు, 44 కేరోసు, సీయహా, పాదోను, 45 లెబానా, హగాబా, అక్కూబ్, 46 హాగాబు, షల్మయి, హానాను, 47 గిద్దేల్, గహరు, రెవాయా, 48 రెజీను, నెకోదా, గజ్జాం, 49 ఉజ్జా, పాసెయ, బేసాయి, 50 అస్నా, మెహునీం, నెపూసీం, 51 బక్‌బూకు, హకూపా, హర్‌జూరు, 52 బజ్‌లీతు, మెహీదా, షర్షా, 53 బర్కోసు, సీసెరా, తెమహు, 54 నెజీయహు, హటీపా అనేవారి వంశాలవారు.
55 సొలొమోను సేవకుల వంశాలవారు వీరు: సొటయి, హసోపెరెతు, పెరూదా, 56 యహలా, దర్కోను, గిద్దేల్, 57 షెపట్యా, హట్టీల్, పొకెరెత్ హజెబాయిం, ఆమీ అనేవారి వంశీయులు. 58 దేవాలయ సేవకులూ సొలొమోను సేవకుల వంశాలవారూ అందరూ కలిసి మూడు వందల తొంభై ఇద్దరు.
59 తేల్‌మెలహు, తేల్‌హర్షా, కెరూబు, అద్దాను, ఇమ్మేరు అనే స్థలాలకు చెందినవారు కొంతమంది వచ్చారు. కాని, వారు తమ పూర్వీకుల కుటుంబాలు, వంశాలు ఇస్రాయేల్ ప్రజలలో ఉన్నాయో లేవో నిదర్శనాలు ఇవ్వలేకపోయారు. 60 వారెవరంటే, దెలయ్యా, టోబీయా, నెకోదా అనేవారి వంశాలవారు. వారు ఆరువందల యాభై ఇద్దరు. 61 అలాంటివారు యాజులలో కూడా కొంతమంది ఉన్నారు. వారు హబాయా, హాక్కోజు, బర్‌జిల్లయి అనేవారి వంశీయులు (ఈ బర్‌జిల్లయి గిలాదువాడైన✽ బర్‌జిల్లయి కూతుళ్ళలో ఒకతెను పెండ్లి చేసుకొన్నాడు. కనుక ఆ పేరు అతడికి వచ్చింది). 62 వారు వంశావళి గ్రంథంలో తమ పేరులను వెదికారు గాని అవి కనబడలేదు. అందుచేత వారు అపవిత్రులు✽గా ఎంచబడి యాజులలో చేరలేకపోయారు. 63 “ఊరీం”, “తుమ్మీం” ధరించగల యాజి నియమించబడేవరకు దేవునికి ప్రతిష్ఠమైన భోజన పదార్థాలను వారు తినకూడదని ప్రజల అధికారి ఆదేశించాడు.
64 సమకూడిన ఆ ప్రజల లెక్క మొత్తం నలభై రెండు వేల మూడు వందల అరవైమంది✽. 65 వారు గాక వారి పరిచారకులు, పరిచారికలు ఏడు వేల మూడు వందల ముప్ఫయి ఏడుమంది. రెండు వందల మంది గాయకులు, గాయకురాండ్రు కూడా ఉన్నారు. 66 ప్రజల గుర్రాలు ఏడు వందల ముప్ఫయి ఆరు, కంచరగాడిదలు రెండు వందల నలభై అయిదు, 67 ఒంటెలు నాలుగు వందల ముప్ఫయి అయిదు, గాడిదలు ఆరువేల ఏడువందల ఇరవై.
68 వారు జెరుసలంలో యెహోవా దేవాలయం ఉన్న స్థలానికి చేరినప్పుడు, వంశనాయకులలో కొంతమంది ఆ దేవాలయాన్ని దాని స్థలంలో మళ్ళీ కట్టడానికి స్వేచ్ఛార్పణలు✽ ఇచ్చారు. 69 ఆ పనికోసం తమ శక్తి కొద్ది వారు ఖజానాకు ఇచ్చినది అయిదు వందల కిలోగ్రాముల బంగారం, మూడు వేల కిలోగ్రాముల వెండి, యాజుల కోసం నూరు వస్త్రాలు.
70 తరువాత యాజులు, లేవీగోత్రికులు ప్రజలలో కొంతమందితోకూడా, గాయకులు, ద్వారపాలకులు, దేవాలయ సేవకులు తమ ఊళ్ళకు వెళ్ళి కాపురం చేశారు. మిగిలిన ఇస్రాయేల్ ప్రజలంతా కూడా తమ ఊళ్ళలో కాపురం చేశారు.