25
1 ఆసాపు, హేమాను, యెదూతూను అనేవారి కొడుకులలో కొంతమందిని దావీదు, సైన్యాధిపతులు ప్రత్యేక సేవకు నియమించారు. వారి సేవ తంతివాద్యాలూ తాళాలూ వాయిస్తూ దేవుణ్ణి గురించి ప్రకటించడం. ఈ సేవ చేసేవారి జాబితా ఇది: 2 ఆసాపు కొడుకులలో జక్కూరు, యోసేపు, నెతనయా, అషరయేలా. వీరు ఆసాపు నడుపుదల ప్రకారం ప్రకటించేవారు; ఆసాపు రాజు నడుపుదల ప్రకారం ప్రకటించేవాడు. 3 యెదూతూను కొడుకులలో గెదలయా, జెరీ, యెషయా, షిమీ, హషబయా, మత్తితయా అనే ఆరుగురు. వీరు వారి తండ్రి యెదూతూను నడుపుదల క్రింద ఉండి ప్రకటించేవారు. యెదూతూను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు అర్పించేటప్పుడు తంతివాద్యం వాయిస్తూ ప్రకటించేవాడు. 4 హేమాను కొడుకులలో బక్కీయా, మత్తనయా, ఉజ్జీయేల్, షెబూయేల్, యెరీమోతు, హననయా, హనానీ, ఎలీయాతా, గిద్దలతీ, రోమమతీయెజెరు, యోషబెకాషా, మల్లోతి, హోతీరు, మహజీయోతు ప్రకటించేవారు. 5 వీరంతా రాజుకు దీర్ఘదర్శిగా ఉన్న హేమాను కొడుకులు. తన వాగ్దానాల ప్రకారంగా హేమానును గొప్పచేయడానికి దేవుడు వారిని హేమానుకు ప్రసాదించాడు. దేవుడు హేమానుకు పద్నాలుగురు కొడుకులనూ ముగ్గురు కూతుళ్ళను అనుగ్రహించాడు. 6 వీరంతా తమ తండ్రి నడుపుదల ప్రకారం యెహోవా ఆలయంలో తాళాలూ తంతివాద్యాలూ వాయిస్తూ, పాటలు పాడుతూ, దేవాలయంలో సేవ చేస్తూ ఉండేవారు. ఆసాపు, యెదూతూను, హేమాను రాజు నడుపుదల క్రింద ఉండేవారు. 7 యెహోవాకు గానం చేయడంలో నేర్పు పొందిన వీరి బంధువులతో కూడా ఈ ప్రవీణులందరి లెక్క రెండు వందల ఎనభై ఎనిమిది. 8 పిన్న అనీ పెద్ద అనీ, గురువనీ శిష్యుడనీ భేదం లేకుండా తమ బాధ్యతల విషయం చీట్లు వేసి వంతులు పంచుకొన్నారు.
9 మొదటి చీటి ఆసాపు కుటుంబంలో ఉన్న యోసేపుకు పడింది. అతడూ అతడి బంధువులూ కొడుకులూ పన్నెండుగురు. రెండోది గెదలయాకు పడింది. అతడూ అతడి బంధువులూ కొడుకులూ పన్నెండుగురు. 10 మూడోది జక్కూరుకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు. 11 నాలుగోది యిజ్రీకి పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు. 12 అయిదోది నెతనయాకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు. 13 ఆరోది బక్కీయాకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు. 14 ఏడోది యెషరయేలాకు పడింది. అతడూ అతడి కొడుకులు బంధువులూ పన్నెండుగురు. 15 ఎనిమిదోది యెషయాకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు. 16 తొమ్మిదోది మత్తనయాకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు. 17 పదోది షిమీకి పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు. 18 పదకొండోది అజరేల్‌కు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు. 19 పన్నెండోది హషబయాకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు. 20 పదమూడోది షూబాయేల్‌కు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు. 21 పద్నాలుగోది మత్తితయాకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు. 22 పదిహేనోది యెరేమోతుకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు. 23 పదహారోది హననయాకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు. 24 పదిహేడోది యొషబెకాషాకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు. 25 పద్ధెనిమిదోది హనానీకి పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు. 26 పందొమ్మిదోది మల్లోతికి పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు. 27 ఇరవైయ్యోది ఎలీయాతాకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు. 28 ఇరవై యొకటోది హోతీరుకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు. 29 ఇరవై రెండోది గిద్దత్తీకి పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు. 30 ఇరవై మూడోది మహజీయోతుకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుగురు. 31 ఇరవై నాలుగోది రోమమతీయెజెరుకు పడింది. అతడూ అతడి కొడుకులూ బంధువులూ పన్నెండుమంది.