24
1 ✝ఇవి అహరోను సంతతివారికి కలిగిన వంతులు. అహరోను కొడుకులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. 2 నాదాబు, అబీహు సంతానం లేకుండా తమ తండ్రికంటే ముందుగా చనిపోయారు✽ గనుక ఎలియాజరు, ఈతామారు యాజులుగా సేవ చేశారు. 3 ఎలియాజరు సంతతివారిలో సాదోకు✽ ఒకడు. ఈతామారు సంతతివారిలో అహీమెలెకు ఒకడు. సాదోకు, అహీమెలెకుల సహాయంతో దావీదు అహరోను సంతతివారిని వారి లెక్కలప్రకారం గుంపులుగా చేసి వారికి బాధ్యతలు నియమించాడు. 4 ఈతామారు సంతతివారిలోని నాయకుల కంటే ఎలియాజరు సంతతివారిలోని నాయకులు ఎక్కువమంది గనుక దానిప్రకారం వారిని గుంపులుగా చేశారు. ఎలియాజరు సంతతివారిలో పదహారుగురు కుటుంబ నాయకులు ఉన్నారు, ఈతామారు సంతతిలో ఎనిమిదిమంది కుటుంబ నాయకులు ఉన్నారు. 5 ఎలియాజరు సంతతివారిలో కొందరూ ఈతామారు సంతతివారిలో కొందరూ పవిత్రాలయంలో అధికారులుగా దేవునికి సేవ చేసేవారు గనుక పక్షపాతం లేకుండా చీట్లు✽ వేసి వంతులు పంచుకొన్నారు. 6 రాజు, అధిపతులు, సాదోకుయాజి, అబ్యాతారు కొడుకు అహీమెలెకు, యాజులలో లేవీగోత్రికులలో కుటుంబ నాయకులు (ఎలియాజరు సంతతివారిలో ఒకడు, ఈతామారు సంతతివారిలో ఒకడు) సమకూడి ఉన్నప్పుడు వారి ఎదుటే లేవీగోత్రికుడూ రాజ్య దస్తావేజులు రాసిపెట్టేవాడూ నెతనేల్ కొడుకూ అయిన షెమయా అహరోను సంతతివారి పేర్లు దాఖలు చేశారు.7 మొదటి చీటి యెహోయారీబ్‌కు పడింది. రెండోది యెదాయాకు పడింది. 8 మూడోది హారీంకు పడింది. నాలుగోది శెయొరీంకు పడింది. 9 అయిదోది మల్కీయాకు పడింది. ఆరోది మీయామినుకు పడింది. 10 ఏడోది హక్కోజ్‌కు పడింది. ఎనిమిదోది అబీయాకు పడింది. 11 తొమ్మిదోది యేషూవకు పడింది. పదోది షెకనయాకు పడింది. 12 పదకొండోది ఎల్‌యాషీబ్‌కు పడింది. పన్నెండోది యాకీంకు పడింది. 13 పదమూడోది హుప్పాకు పడింది. పద్నాలుగోది యెషెబాబ్‌కు పడింది. 14 పదిహేనోది బిలాగాకు పడింది. పదహారోది ఇమ్మేరుకు పడింది. 15 పదిహేడోది హెజీరుకు పడింది. పద్ధెనిమిదోది హప్పిస్సేసుకు పడింది. 16 పందొమ్మిదోది పెతహయాకు పడింది. ఇరవైయ్యోది యెహెజ్కేల్‌కు పడింది. 17 ఇరవై ఒకటోది యాకీనుకు పడింది. ఇరవై రెండోది గామాల్‌కు పడింది. 18 ఇరవై మూడోది దెలాయ్యాకు పడింది. ఇరవై నాలుగోది మయజయాకు పడింది. 19 ✽ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా వారి పూర్వీకుడైన అహరోనుకు ఆజ్ఞాపించినట్టు, అహరోను వారికి ఇచ్చిన పద్ధతి ప్రకారం వారు యెహోవా ఆలయంలో ప్రవేశించినప్పుడు వారు ఈ వరుసక్రమం అనుసరించవలసినవారు.
20 లేవీ సంతతివారిలో మిగతావారెవరంటే, అమ్రాం సంతతివారిలో షూబాయేల్; షూబాయేల్ సంతతివారిలో యెహెదయా; 21 రెహబయా విషయం రెహబయా కొడుకులలో పెద్దవాడు ఇష్షీయా; 22 ఇసహార్‌వారిలో షెలోమోతు; షెలోమోతు కొడుకులలో యహతు; 23 హెబ్రోను సంతానంలో పెద్దవాడైన యెరీయా, రెండోవాడైన అమరయా, మూడోవాడైన యహజీయేల్, నాలుగోవాడైన యెకమెయాం; 24 ఉజ్జీయేల్ సంతానంలో మీకా; మీకా కొడుకులలో షామీరు; 25 మీకా తోబుట్టువు ఇష్షీయా, ఇష్షీయా కొడుకులలో జెకర్యా; 26 మెరారి కొడుకులైన మహలి, మూషి; యహజీయా వంశంలో బెనో; 27 యహజీయావల్ల మెరారికి కలిగిన సంతతివారైన బెనో, షోహం, జక్కూరు, ఇబ్రీ. 28 మహలికి ఎలియాజరు కలిగాడు. ఎలియాజరుకు కొడుకులు లేరు. 29 కీషుకు యెరహమెయేల్ కలిగాడు. 30 మూషి కొడుకులు మహలి, ఏదెరు, యెరీమోతు.
వీరందరూ తమ కుటుంబాల ప్రకారం లేవీగోత్రికులు. 31 వీరు తమ బంధువులైన అహరోను సంతతివారు చేసినట్టు, దావీదు రాజు ఎదుటా, సాదోకు, అహీమెలెకు, యాజులలో లేవీగోత్రికులలో కుటుంబ నాయకుల ఎదుటా చీట్లు✽ వేసుకున్నారు. కుటుంబ నాయకులకూ వారి చిన్న సోదరుల✽కూ ఒకే రీతిగా చీట్లు వేసుకొన్నారు.