8
1 ✽ బెన్‌యామీనుకు మొదట పుట్టినవాడు బెల, రెండోవాడు అషబేల్, మూడోవాడు అహరహు, 2 నాలుగోవాడు నోహా, అయిదోవాడు రాపా. 3 బెలకు జన్మించిన కొడుకులు: అద్దారు, గెరా, అబీహూదు, 4 అబీషూవ, నయమాను, అహోయహు, 5 గెరా, షెపూపాను, హూరాం. 6 ఏహూదు✽కు జన్మించిన కొడుకులు: నయమాను, అహీయా, గెరా. వీరు గెబ ఊరి వారికి కుటుంబాల నాయకులు. వారు బందీలుగా మనహతుకు వెళ్ళారు. 7 గెరా వారిని అక్కడికి తీసుకు పోయాడు. ఈ గెరాకు ఉజ్జా, అహీహూదు జన్మించారు. 8 షహరయిం తన భార్యలు హుషీంను, బయరాను పంపివేసిన తరువాత అతనికి మోయాబులో సంతానం కలిగారు. 9 తన భార్య హోదెషు వల్ల యోబాబ్, జిబయా, మేషా, మల్కాం, 10 యెవూజ్, షాకయా, మిర్మా జన్మించారు. వీరు అతని కొడుకులు. వారు కుటుంబాల నాయకులు. 11 అతనికి హుషీం అబీటూబ్‌ను, ఎల్‌పయల్‌ను కన్నది. 12 ఎల్‌పయల్ కొడుకులు: ఏబెరు, మిషాం, షెమెదు, బెరీయా, షెమదు. 13 షెమెదు ఓనో, లోదులనూ లోదుకు చెందిన గ్రామాలనూ కట్టించాడు. బెరీయా, షెమ అయ్యాలోను నివాసులకు వంశ నాయకులు. వారు గాతు నివాసులను వెళ్ళగొట్టారు. 14 బెరీయా కొడుకులు: అహయో, షాషకు, యరేమోతు, 15 జెబదయా, అరాదు, ఏదెరు, 16 మికాయేల్, ఇష్బా, యోహా. 17 ఎల్‌పయల్ కొడుకులు: జబదయా, మెషుల్లాం, హిజికి, హెబెరు, 18 ఇషమెరయి, ఇజలీయా, యోబాబ్. 19 షిమీ కొడుకులు: యాకీం, జిక్రీ, జబ్ది, 20 ఎలీయేనయి, జిల్లెతయి, ఎలీయేల్, 21 అదాయా, బెరాయా, షిమ్రాతు. 22 షాషకు కొడుకులు: ఇష్పాను, ఏబెరు, ఎలీయేల్, 23 అబదోను, జిఖ్రీ, హనాను, 24 హననయా, ఏలాం, అంతోతీయా, 25 ఇపెదయా, పెనూయేల్. 26 యెరోహాం కొడుకులు: షంషెరయి, షెహరయా, అతల్యా, 27 యహరెషయా, ఏలీయా, జిఖ్రీ. 28 వీరందరూ తమ పూర్వీకుల వంశవృక్షాల ప్రకారం వంశ నాయకులు; వారు జెరుసలంలో కాపురముంటూ ప్రముఖులయ్యారు.29 ✝గిబియోను తండ్రి యెహీయేల్ గిబియోను పట్టణం లో కాపురముండేవాడు. అతని భార్య పేరు మయకా. 30 అతనికి అబ్దోను మొదట జన్మించినవాడు. తరువాత సూర్, కీషు, బేల్, నాదాబ్, 31 గెదోరు, అహయో, జెకెరు, 32 మికలోతు జన్మించారు. మికలోతుకు షిమయా జన్మించాడు. వీరు తమ బంధువుల దగ్గర, జెరుసలంలో తమ బంధువులతో కూడా కాపురముండేవారు. 33 నేర్‌కు కీషు జన్మించాడు. కీషుకు సౌలు✽ జన్మించాడు. సౌలుకు యోనాతాను, మల్కీషూవ, అబీనాదాబ్, ఎష్‌బేల్ జన్మించారు. 34 యోనాతాను✽ కొడుకు మెరీబ్బేల్✽. మెరీబ్బేల్‌కు మీకా జన్మించాడు. 35 మీకా కొడుకులు: పీతోను, మెలెకు, తరేయ, ఆహాజ్. 36 ఆహాజ్‌కు యెహోయాదా జన్మించాడు. యెహోయాదాకు ఆలెమెతు, ఆజమావెతు, జిమ్రీ జన్మించారు. జిమ్రీకి మోజా జన్మించాడు. 37 మోజాకు బినయా జన్మించాడు. బినయాకు రాపా జన్మించాడు. రాపాకు ఎలాశా జన్మించాడు. ఎలాశాకు ఆజేల్ జన్మించాడు. 38 ఆజేల్ కొడుకులు ఆరుగురు. వారి పేర్లు అజ్రీకాం, బోకెరు, ఇష్మాయేల్, షెయరయా, ఓబద్యా, హానాను. వీరందరూ ఆజేల్ కొడుకులు. 39 అతని సోదరుడైన ఏషెకు కొడుకులు: మొదట పుట్టినవాడు ఊలాం, రెండోవాడు యెహూషు, మూడోవాడు ఎలీపేలెట్. 40 ఊలా కొడుకులు విలువిద్యలో ప్రవీణులు, పరాక్రమశాలురు. వారికి నూట యాభై మంది కొడుకులూ మనుమలూ కలిగారు. వీరందరూ బెన్యామీను సంతతివారు.