9
1 ఇస్రాయేల్ ప్రజలందరి పేర్లూ తమ వంశాల ప్రకారం ఇస్రాయేల్ రాజుల గ్రంథంలో వ్రాసి నమోదయ్యాయి. యూదావారు దేవుని మీద ద్రోహం చేసినందుకు వారిని బబులోను✽కు బందీలుగా తీసుకుపోవడం జరిగింది. 2 తమ ఆస్తి, పట్టణాలలో మొదట కాపురమేర్పరచుకొన్న✽వారు ఎవరంటే, కొంతమంది ఇస్రాయేల్‌వారు, యాజులు, లేవీ గోత్రికులు, దేవాలయ సేవకులు. 3 యూదావారిలో, బెన్‌యామీనువారిలో, ఎఫ్రాయింవారిలో, మనష్షే✽ వారిలో జెరుసలంలో కాపురమున్నవారు వీరు: 4 అమీహూదు కొడుకు ఊతయి (అమీహూదు ఒమ్రీ కొడుకు. ఒమ్రీ ఇమ్రీ కొడుకు. ఇమ్రీ బానీ కొడుకు. బానీ పెరెసు సంతతివాడు పెరెసు యూదా కొడుకు). 5 షిలోనువారిలో మొదట పుట్టిన ఆశాయా, అతని కొడుకులు; 6 జెరహు సంతతివారిలో యెవుయేల్, అతని బంధువులు. మొత్తం ఆరు వందల తొంభైమంది. 7 బెన్‌యామీనువారిలో మెషుల్లాం కొడుకు సల్లు (మెషుల్లాం హోదవయా కొడుకు. హోదవయా హసెనూయా కొడుకు), 8 యెరోహాం కొడుకు ఇబ్నీయా, మిక్రి మనుమడూ ఉజ్జీ కొడుకూ అయిన ఏలా, షెఫటయా కొడుకు మెషుల్లాం (షెఫటయా తండ్రి రగూయేల్, రగూయేల్ తండ్రి ఇబ్నీయా). 9 వీరు, వీరి బంధువులు, తమ వంశాల జాబితాల ప్రకారం తొమ్మిది వందల యాభై ఆరుమంది. ఈ మనుషులందరూ తమ కుటుంబాలకు నాయకులు.10 యాజులలో వీరు జెరుసలంలో కాపురముండేవారు: యెదాయా, యెహోయారీబ్, యాకీను, 11 దేవుని ఆలయంలో అధిపతీ హిల్కీయా కొడుకూ అయిన అజరయా (హిల్కీయా మెషుల్లాం కొడుకు, మెషుల్లాం సాదోకు కొడుకు, సాదోకు మెరాయోతు కొడుకు మెరాయోతు అహీటూబ్ కొడుకు), 12 యెరోహాం కొడుకు అదాయా (యెరోహాం పశూర్ కొడుకు, పశూర్ మల్కీయా కొడుకు), అదియేల్ కొడుకు మశై (అదీయేల్ యహజేరా కొడుకు), యహజేరా మెషుల్లాం కొడుకు, మెషుల్లాం మెషిల్లేమీతు కొడుకు, మషిల్లేమీతు ఇమ్మేరు కొడుకు. 13 వీరూ కుటుంబాల నాయకులైన వీరి బంధువులూ వెయ్యిన్ని ఏడు వందల అరవైమంది. దేవుని ఆలయ సేవ చేయడానికి వారు చాలా సామర్థ్యం గలవారు.
14 లేవీగోత్రికులలో వీరు జెరుసలంలో కాపురముండేవారు: మెరారి సంతతివాడు, హష్షూబ్ కొడుకు షెమయా (హష్షూబ్ అజ్రీకాం కొడుకు, అజ్రీకాం హషబయా కొడుకు), 15 బకబక్కరు, హెరెషు, గాలాల్, మీకా కొడుకు మత్తనయా (మీకా జిక్రీ కొడుకు, జిక్రీ ఆసాపు కొడుకు), 16 షెమయా కొడుకు ఓబద్యా (షెమయా గాలాల్ కొడుకు, గాలాల్ యెదూతూను కొడుకు), ఎల్కానా మనుమడూ ఆసా కొడుకూ అయిన బెరెకయా. ఎల్కానా నెటోపాతీవారి గ్రామాలలో కాపురముండేవాడు.
17 ఈ ద్వారపాలకులు జెరుసలంలో కాపురమున్నారు: షల్లూం, అక్కూబ్, టలమోను, అహీమాను, వారి బంధువులు. వీరిలో షల్లూం నాయకుడు. 18 ఇదివరకు అతడు కాపాడవలసిన ద్వారం తూర్పుగా ఉన్న “రాజ ద్వారం”. వీరందరూ లేవీగోత్రికులలో ద్వారపాలకులు. 19 కోరహుకు జన్మించిన ఎబియాసాపు మనుమడూ కోరె కొడుకూ అయిన షల్లూం, తన కోరహు వంశంలో ఉన్న తన బంధువులు ఆలయం ద్వారాన్ని కాపలా కాచే సేవ చేసేవారు. వారి పూర్వీకులు యెహోవా శిబిరానికి✽ కాపలాదారులై ఉండి దాని ద్వారాన్ని కాచేవారు.
20 పూర్వకాలంలో ఎలియాజరు కొడుకు ఫీనెహాసు✽ ద్వారపాలకుల మీద అధికారిగా ఉన్నాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు. 21 మెషెలెమయా కొడుకు జెకర్యా సన్నిధిగుడారం ద్వారానికి కావలివాడు. 22 గడపల దగ్గర ద్వారపాలకులు✽గా ఎన్నుకోబడ్డ వారందరూ రెండు వందల పన్నెండుమంది. వారు తమ గ్రామాలలో తమ వంశాల ప్రకారం నమోదైనవారు. వారు నమ్మతగ్గవారని దావీదు, దీర్ఘదర్శి✽ అయిన సమూయేలు వారిని నియమించారు. 23 వారికీ వారి సంతతివారికీ యెహోవా నివాసమైన గుడారం ద్వారాలకు కావలి కాచే బాధ్యత ఉంది. 24 ద్వారపాలకులు నాలుగు వైపులా – తూర్పున, పడమర, ఉత్తరాన, దక్షిణాన – ఉన్నారు. 25 వారి బంధువులు కాలక్రమం చొప్పున తమ గ్రామాల నుంచి వచ్చి ఏడు రోజులు వారిదగ్గర గడిపి వారికి సహాయం చేసేవారు. 26 ప్రముఖ ద్వారపాలకులు నలుగురు. వారు కూడా లేవీ గోత్రికులు. వారు బాధ్యత వహించవలసినవారై దేవుని ఆలయం గదుల మీదా ఖజానాల మీదా నియమించబడ్డారు. 27 వారు దేవుని ఆలయానికి కాపలాదారులు✽ గనుక దాని చుట్టూరా రాత్రి గడిపేవారు. ప్రతి ఉదయం దాని తలుపులు తెరచేవారు.
28 ద్వారపాలకులలో కొంతమంది ఆలయ సేవ సామానును చూచేవారు. ఆ వస్తువులు లోపలికి తెచ్చినప్పుడు, బయటికి తీసుకుపోయినప్పుడు వారు లెక్కపెట్టేవారు. 29 ✝మరికొందరు మిగతా సామానునూ, పవిత్ర స్థానం పాత్రలన్నిటినీ చూచే బాధ్యతకు నియమించబడ్డవారు. మెత్తని పిండి, ద్రాక్షరసం, నూనె, ధూపద్రవ్యం, సంభారం వారి అధీనంలో ఉన్నాయి. 30 అయితే యాజులలో కొంతమంది ధూపం కోసం సుగంధ ద్రవ్యాలను✽ కలిపేవారు. 31 కోరహు వంశంవాడు షల్లూంకు మొదట పుట్టినవాడై మత్తితయా అనే లేవీగోత్రికుడు రొట్టెలు✽ చేసే పని చూచేవాడు. 32 వారి బంధువులైన కహాత్ వంశీయులలో కొంతమందికి ప్రతి విశ్రాంతి దినంకోసం సన్నిధి రొట్టెలు సిద్ధం చేసే బాధ్యత ఉంది. 33 లేవీగోత్రికులలో గాయకులు✽ కుటుంబాల నాయకులై ఉంటే, దేవాలయం గదులలో కాపురముండేవారు. రాత్రింబగళ్ళు తమ పనిలో నిమగ్నులు కావడంచేత వారికి వేరే పని నియమించబడలేదు. 34 వీరందరూ లేవీగోత్రకుటుంబాల పెద్దలు, తమ వంశాలప్రకారం నాయకులు. వారు జెరుసలంలోనే కాపురముండేవారు.
35 ✝యెహీయేల్ గిబియోనుకు తండ్రి. అతడు గిబియోను పట్టణంలో కాపురముండేవాడు. అతని భార్య పేరు మయకా. 36 అతనికి మొదట పుట్టినవాడు అబ్దోను. తరువాత సూర్, కీషు, బేల్, నేర్, నాదాబ్, 37 గెదోరు, అహియో, జెకర్యా, మికలోతు జన్మించారు. 38 మికలోతుకు షిమయాను జన్మించాడు. వీరు కూడా జెరుసలంలో తమ బంధువులదగ్గర కాపురముండేవారు. 39 నేర్‌కు కీషు జన్మించాడు. కీషుకు సౌలు జన్మించారు. సౌలుకు యోనాతాను, మెల్కిషూవ, అబీనాదాబ్, ఎష్‌బేల్ జన్మించారు. 40 యోనాతాను కొడుకు మెరీబ్బేల్. మెరీబ్బేల్‌కూ మీకా జన్మించాడు. 41 మీకా కొడుకులు: పీతోను, మెలెకు, తరేయ, ఆహాజ్. 42 ఆహాజ్‌కు యరా జన్మించాడు. యరాకు ఆలెమెతు, అజమావెతు, జిమ్రీ జన్మించారు. జిమ్రీకి మోజా జన్మించాడు. 43 మోజాకు బినయా జన్మించాడు. బినయా కొడుకు రెఫాయా. రెఫాయా కొడుకు ఎలాశా. ఎలాశా కొడుకు ఆజేల్. 44 ఆజేల్‌కు ఆరుగురు కొడుకులున్నారు. వారి పేర్లు అజ్రీకాం, బోకెరు, ఇష్మాయేల్, షెయరయా, ఓబద్యా, హానాను. వీరు ఆజేల్ కొడుకులు.