6
1 లేవీ కొడుకులు: గెర్షోను, కహాతు, మెరారి. 2 కహాతు కొడుకులు: అమ్రాం, ఇసహారు, హెబ్రోను, ఉజ్జీయేల్. 3 అమ్రాం సంతానం: అహరోను, మోషే, మిర్యాం. అహరోను కొడుకులుకు: నాదాబ్, అబీహు, ఎలియాజరు, ఈతామారు. 4 ఎలియాజరుకు ఫీనెహాసు జన్మించాడు. ఫీనెహాసుకు అబీషూవ జన్మించాడు. 5 అబీషూవకు బుక్కీ జన్మించాడు. బుక్కీకి ఉజ్జీ జన్మించాడు. 6 ఉజ్జీకి జెరహయా జన్మించాడు. జెరహయాకు మెరాయోతు జన్మించాడు. 7 మెరాయోతుకు అమరయా జన్మించాడు. అమరయాకు అహీటూబ్ జన్మించాడు. 8 అహీటూబ్‌కు సాదోకు జన్మించాడు. సాదోకుకు అహిమయసు జన్మించాడు. 9 అహిమయసుకు అజరయా జన్మించాడు. అజరయాకు యోహానాను జన్మించాడు. 10 యోహానానుకు అజరయా జన్మించాడు (సొలొమోను జెరుసలంలో కట్టించిన దేవాలయంలో ఈ అజరయా యాజిగా సేవ చేశాడు). 11 అజరయాకు అమరయా జన్మించాడు. అమరయాకు అహీటూబ్ జన్మించాడు.
12 అహీటూబ్‌కు సాదోకు జన్మించాడు. సాదోకుకు షల్లూం జన్మించాడు. 13 షల్లూంకు హిల్కీయా జన్మించాడు. హిల్కీయాకు అజరయా జన్మించాడు. 14 అజరయాకు శెరాయా జన్మించాడు. శెరాయాకు యెహోజాదాకు జన్మించాడు. 15 యెహోవా నెబుకద్‌నెజరుచేత యూదావారినీ, జెరుసలం నగరవాసులనూ బందీలుగా దేశాంతరం పంపించినప్పుడు ఈ యెహోజాదాకు వారితో కూడా బందీగా వెళ్ళాడు.
16 లేవీ కొడుకులు: గెర్షోను, కహాతు, మెరారి. 17 గెర్షోను కొడుకుల పేర్లు ఇవి: లిబ్నీ, షిమి. 18 కహాతు కొడుకులు: అమ్రాం, ఇసహారు, హెబ్రోను, ఉజ్జీయేల్. 19 మెరారి కొడుకులు: మహలి, మూషి. వారి పూర్వీకుల వంశావళిప్రకారం లేవీగోత్రికుల కుటుంబాలు ఇవి: 20 గెర్షోను కొడుకు లిబ్నీ. లిబ్నీ కొడుకు యహతు. యహతు కొడుకు జిమ్మా. 21 జిమ్మా కొడుకు యోవాహు. యోవాహు కొడుకు ఇద్దో. ఇద్దో కొడుకు జెరహు. జెరహు కొడుకు యెయతిరయి. 22 కహాతు కొడుకు అమ్మీనాదాబ్. అమ్మీనాదాబ్ కొడుకు కోరహు. కోరహు కొడుకు అస్సీరు. 23 అస్సీరు కొడుకు ఎల్కానా. ఎల్కానా కొడుకు అబియాసాపు. అబియాసాపు కొడుకు అస్సీరు. 24 అస్సీరు కొడుకు తాహతు. తాహతు కొడుకు ఉరియేల్. ఉరియేల్ కొడుకు ఉజ్జియా. ఉజ్జియా కొడుకు షావూల్. 25 ఎల్కానా సంతతివారు: అమాశై, అహీమోతు. 26 అహీమోతు కొడుకు ఎల్కానా. ఎల్కానా కొడుకు జోపై. జోపై కొడుకు నహతు. 27 నహతు కొడుకు ఏలీయాబ్. ఏలీయాబ్ కొడుకు యెరోహాం. యెరోహాం కొడుకు ఎల్కానా, ఎల్కానా కొడుకు సమూయేల్. 28 సమూయేల్ కొడుకులు: మొదట పుట్టినవాడు వష్నీ, రెండోవాడు అబీయా. 29 మెరారి సంతతివారు: అతని కొడుకు మహలి, మహలి కొడుకు లిబ్నీ, లిబ్నీ కొడుకు షిమీ, షిమీ కొడుకు ఉజ్జా, 30 ఉజ్జా కొడుకు షిమయా, షిమయా కొడుకు హగ్గీయా, హగ్గీయా కొడుకు అశాయా.
31 ఒడంబడిక పెట్టెను యెహోవా ఆలయంలో ఉంచడం జరిగిన తరువాత ఆలయంలో సంగీత సేవకు దావీదు నియమించిన వారు వీరే. 32 సొలొమోను జెరుసలంలో యెహోవా ఆలయాన్ని కట్టించేవరకు వీరు సన్నిధిగుడారం ఆవరణంలో సంగీత సేవ చేశారు. వారికి నియమించిన చట్టాలప్రకారం తమ పని చూచుకొన్నారు. 33 ఇలాగు తమ కొడుకులతో కలిసి సేవ చేసినవారెవరంటే, కహాతు సంతతివారిలో హేమాను గాయకుడు. అతడు యోవేల్ కొడుకు. యోవేల్ సమూయేలు కొడుకు. 34 సమూయేలు ఎల్కానా కొడుకు. ఎల్కానా యెరోహాం కొడుకు. యెరోహాం ఎలీయేల్ కొడుకు. ఎలీయేల్ తోయహు కొడుకు. 35 తోయహు సూపు కొడుకు. సూపు ఎల్కానా కొడుకు. ఎల్కానా మహతు కొడుకు. మహతు అమాశయి కొడుకు. 36 అమాశయి ఎల్కానా కొడుకు. ఎల్కానా యోవేల్ కొడుకు. యోవేల్ అజరయా కొడుకు. అజరయా జెఫనయా కొడుకు. 37 జెఫనయా తాహతు కొడుకు. తాహతు అస్సీరు కొడుకు. అస్సీరు ఎబియాసాపు కొడుకు. ఎబియాసాపు కోరహు కొడుకు. 38 కోరహు ఇసహారు కొడుకు. ఇసహారు కహాతు కొడుకు. కహాతు లేవీ కొడుకు. లేవీ ఇస్రాయేల్ కొడుకు.
39 హేమాను సాటి సేవకుడు ఆసాపు. అతడు హేమాను కుడిప్రక్కన సేవ చేసేవాడు. ఆసాపు బరెకయా కొడుకు. బరెకయా షిమయా కొడుకు. 40 షిమయా మికాయేల్ కొడుకు. మికాయేల్ బయశేయా కొడుకు. బయశేయా మల్కీయా కొడుకు. 41 మల్కీయా యెత్నీ కొడుకు. యెత్నీ జెరహు కొడుకు. జెరహు అదాయా కొడుకు. 42 అదాయా ఏతాను కొడుకు. ఏతాను జిమ్మా కొడుకు. జిమ్మా షిమీ కొడుకు. 43 షిమీ యహతు కొడుకు. యహతు గెర్షోను కొడుకు. గెర్షోను లేవీ కొడుకు.
44 హేమాను ఎడమ ప్రక్కన మెరారి వంశంలో ఒకడు సేవ చేసేవాడు. అతడు కీషీ కొడుకు ఏతాను. కీషీ అబ్దీ కొడుకు. అబ్దీ మల్లూకు కొడుకు. 45 మల్లూకు హషబయా కొడుకు. హషబయా అమజ్యా కొడుకు. అమజ్యా హిల్కీయా కొడుకు. 46 హిల్కీయా అమ్జీ కొడుకు. అమ్జీ బానీ కొడుకు. బానీ షెమెరు కొడుకు. 47 షెమెరు మహలి కొడుకు. మహలి మూషి కొడుకు మూషి మెరారి కొడుకు. మెరారి లేవీ కొడుకు.
48 వీరి సాటి లేవీగోత్రికులు ఆరాధన గుడారం అనే దైవ నివాసంలో జరగవలసిన పనులన్నిటికీ నియమించబడ్డారు. 49 అయితే అహరోను, అతని సంతతివారు మాత్రమే దేవుని సేవకుడైన మోషే ఆదేశించిన అంతటిప్రకారమూ ఇస్రాయేల్ ప్రజల ప్రాయశ్చిత్తం కోసం అతి పవిత్ర స్థలంలో జరగవలసిన వాటన్నిటినీ చేయడానికీ, బలిపీఠం మీద హోమాలను అర్పించడానికీ, ధూపవేదిక మీద ధూపం వేయడానికీ నియమించబడ్డారు. 50 అహరోను సంతతివారు: అతని కొడుకు ఎలియాజరు, ఎలియాజరు కొడుకు ఫీనెహాసు, ఫీనెహాసు కొడుకు అబీషూవ, 51 అబీషూవ కొడుకు బుక్కీ, బుక్కీ కొడుకు ఉజ్జీ, ఉజ్జీ కొడుకు జెరహయా, 52 జెరహయా కొడుకు మెరాయోతు, మెరాయోతు కొడుకు అమరయా, అమరయా కొడుకు అహీటూబ్, 53 అహీటూబ్ కొడుకు సాదోకు, సాదోకు కొడుకు అహిమయసు.
54 అహరోను సంతతివారిలో కహాతు వంశంవారిమీద మొదటి చీటి పడింది. ఇవి వారి నివాసస్థలాలు, వారి సరిహద్దులలోని వారి ఆస్తి: 55 యూదాలో ఉన్న హెబ్రోను, దాని చుట్టు ఉన్న పచ్చిక మైదానాలు వారికి ఇవ్వబడ్డాయి. 56 అయితే పట్టణం చుట్టు ఉన్న పొలాలు, దాని గ్రామాలు యెఫున్నె కొడుకు కాలేబుకు చేకూరాయి. 57 హెబ్రోను శరణు పట్టణంగా ఉంది. అహరోను సంతతివారికి ఈ పట్టణాలు ఇవ్వబడ్డాయి: హెబ్రోను, లిబ్నా, దాని పచ్చిక మైదానాలు, యత్తీరు, ఎష్‌టెమోయ, దాని పచ్చిక మైదానాలు, 58 హీలేను, దాని పచ్చిక మైదానాలు, దెబీరు, దాని పచ్చిక మైదానాలు, యత్తీరు, ఎష్‌టెమోయ, 59 ఆషాను, దాని పచ్చిక మైదానాలు, బేత్‌షెమెషు, దాని పచ్చిక మైదానాలు. 60 బెన్యామీను గోత్ర ప్రదేశంలో గెబ, దాని పచ్చిక మైదానాలు, అల్లెమెతు, దాని పచ్చిక మైదానాలు, అనాతోతు, దాని పచ్చిక మైదానాలు ఇయ్యబడ్డాయి. కహాతు వంశంవారికి కలిగిన పట్టణాలన్నీ పదమూడు. 61 కహాతు వంశీయులలో మిగతావారికి మనష్షే అర్ధగోత్ర కుటుంబాల ప్రాంతంలో నుంచి చీటివల్ల పది పట్టణాలు ఇయ్యబడ్డాయి.
62 గెర్షోను సంతతివారికి వారి వంశాల ప్రకారం చీట్లు వేయడం వల్ల పదమూడు పట్టణాలు వచ్చాయి. అవి ఇశ్శాకారు, ఆషేరు, నఫ్తాలి గోత్రాల ప్రదేశాలలో, బాషానులో ఉన్న మనష్షే గోత్రంవారి మధ్య ఉన్నాయి. 63 మెరారి సంతతివారికి వారి వంశాల ప్రకారం చీట్లు వేయడం వల్ల పన్నెండు పట్టణాలు వచ్చాయి. అవి రూబేను, గాదు, జెబూలూను గోత్రాల ప్రదేశాలలో ఉండేవి. 64 ఈ విధంగా ఇస్రాయేల్ ప్రజలు లేవీ గోత్రికులకు ఈ పట్టణాలను, వాటి పచ్చిక మైదానాల్ని ఇచ్చారు. 65 యూదా, షిమ్యోను, బెన్యామీను గోత్రాల ప్రదేశాలలో పై చెప్పిన పట్టణాలు కూడా చీట్లు వేయడం వల్ల వారికి ఇచ్చారు. 66 కహాతువారి కుటుంబాలకు కొన్నిటికి ఆస్తిగా ఎఫ్రాయిం గోత్ర ప్రదేశంలో కొన్ని పట్టణాలు వచ్చాయి. 67 ఎఫ్రాయిం కొండసీమలో శరణు పట్టణంగా ఉన్న షెకెం, దాని పచ్చిక మైదానాలు, గెజెరు, 68 యొక్‌మెయాం, బేత్ హోరోను, 69 అయ్యాలోను, గత్‌రిమ్మోను, ఈ పట్టణాల పచ్చిక మైదానాలు వారికి వచ్చాయి. 70 కహాతువారి మిగతా కుటుంబాలకు మనష్షే అర్ధ గోత్ర ప్రదేశంలోనుంచి ఆనేరు, బిలియాం, వాటి పచ్చిక మైదానాలతోపాటు ఇస్రాయేల్ ప్రజలు ఇచ్చారు.
71 గెర్షోనువారికి ఈ పట్టణాలు వాటి పచ్చిక మైదానాలతో పాటు వచ్చాయి: మనష్షే అర్ధ గోత్ర ప్రదేశంలో నుంచి బాషానులో ఉన్న గోలాను, అష్‌తారోతు; 72 ఇశ్శాకారు గోత్ర ప్రదేశంలో నుంచి కెదెషు, దాబరెతు, 73 రామోతు, ఆనెం; 74 ఆషేరు గోత్ర ప్రదేశంలోనుంచి మాషాల్, అబ్‌దోను, 75 హూక్కోకు, రెహోబ్‌; 76 నఫ్తాలి గోత్ర ప్రదేశంలో నుంచి గలలీలో ఉన్న కెదెషు, హమ్మోన్, కిర్యతాయిం. 77 మిగిలిన లేవీ గోత్రికులైన మెరారివారికి ఈ పట్టణాలు, వాటి పచ్చిక మైదానాలతో పాటు వచ్చాయి: జెబూలూను గోత్ర ప్రదేశంలోనుంచి రిమ్మోన్, తాబోరు; 78 యెరికోకు తూర్పుగా యొర్దాను అవతల ఉన్న రూబేను గోత్ర ప్రదేశంలో నుంచి ఎడారిలో ఉన్న బేసెరు, యహజా, 79 కెదేమోతు, మేఫాతు; 80 గాదు గోత్ర ప్రదేశంలోనుంచి గిలాదులో ఉన్న రామోతు, మహనయీం, 81 హెష్బోను, యాజెరు.