3
1 దావీదుకు హెబ్రోను పట్టణంలో జన్మించిన కొడుకులు వీరు: మొదట పుట్టినవాడు అమ్మోను. అతని తల్లి యెజ్రేల్ పట్టణస్థురాలు అహీనోయం. రెండోవాడు దానియేలు. అతని తల్లి కర్మెల్ గ్రామస్థురాలు అబీగేల్. 2 మూడోవాడు అబ్‌షాలోం. అతని తల్లి గెషూరు రాజైన తల్మయి కూతురు మయకా. నాలుగోవాడు అదోనీయా. అతని తల్లి హగ్గీతు. 3 అయిదోవాడు షెఫటయా. అతని తల్లి అబీటల్. ఆరోవాడు ఇత్రెయాం. దావీదు భార్య ఎగ్లా అతణ్ణి కన్నది. 4 ఈ ఆరుగురు హెబ్రోనులో దావీదుకు జన్మించారు. అక్కడ అతడు ఏడు సంవత్సరాలు ఆరు నెలలు పరిపాలించాడు. జెరుసలంలో ముప్ఫయి మూడు సంత్సరాలు పరిపాలించాడు. 5 జెరుసలంలో అతనికి జన్మించినవారు: అమ్మీయేల్ కూతురైన బత్‌షెబ కన్న షిమయా, షోబాబ్, నాతాను, సొలొమోను అనే నలుగురు; 6 ఇభారు, ఎలీషూవ, ఎలీపేలెట్, 7 నోగహు, నెపెగు, యాఫీయ, 8 ఎలీషామా, ఎల్‌యాదా, ఎలీపేలెట్ అనే తొమ్మిదిమంది కొడుకులు. 9 ఉంపుడు కత్తెలు కన్న అతని కొడుకులు గాక వీరందరూ దావీదు కొడుకులు. తామారు వీరికి సోదరి.
10 సొలొమోను కొడుకు రెహబాం కొడుకు అబీయా. అబీయా కొడుకు ఆసా. ఆసా కొడుకు యెహోషాపాతు. 11 యెహోషాపాతు కొడుకు యెహోరాం. యెహోరాం కొడుకు అహజయా. అహజయా కొడుకు యోవాషు. 12 యోవాషు కొడుకు అమజ్యా. అమజ్యా కొడుకు అజరయా. అజరయా కొడుకు యోతాం. 13 యోతాం కొడుకు ఆహాజు. ఆహాజు కొడుకు హిజ్కియా. హిజ్కియా కొడుకు మనష్షే. 14 మనష్షే కొడుకు ఆమోను, ఆమోను కొడుకు యోషీయా. 15 యోషీయా కొడుకులు: మొదట పుట్టినవాడు యోహానాను, రెండోవాడు యెహోయాకీం, మూడోవాడు సిద్కియా, నాలుగోవాడు షల్లూం. 16 యెహోయాకీం కొడుకులు యెకొనయా, సిద్కియా.
17 ఖైదీగా ఉన్న యెకొనయా కొడుకులు: అస్సీరు, షయల్‌తీయేల్, 18 మల్కీరాం, పెదాయా, షెనజ్జరు, యెకమయా, హోషామా, నెబదయా. 19 పెదాయా కొడుకులు జెరుబ్బాబెల్, షిమీ. జెరుబ్బాబెల్ కొడుకులు: మెషుల్లాం, హననయా. షెలోమీతు వారికి సోదరి. 20 హషుబా, ఓహెల్, బెరెకయా, హసదయా, యూషబ్‌హెసెదు అనే ఇంకా అయిదుగురు ఉన్నారు. 21 హననయా సంతతివారు: పెలటయా, యెసయా, రెఫాయా కొడుకులు, అర్నాను కొడుకులు, ఓబద్యా కొడుకులు, షెకనయా కొడుకులు. 22 షెకనయా సంతతివారు: షెమయా, షెమయా ఆరుగురు కొడుకులు – హట్టూషు, ఇగాల్, బారియా, నెయరయా, షాపాతు. 23 నెయరయా కొడుకులు ముగ్గురు – ఎల్‌యోయేనయి, హిజ్కియా, అజ్రీకాం. 24 ఎల్‌యోయేనయి కొడుకులు ఏడుగురు – హోదవయా, ఎల్‌యాషీబ్, పెలయా, అక్కూబ్, యోహానాను, దెలాయ్యా, అనాని.