2
1 ✽ ఇస్రాయేల్ కొడుకులు: రూబేను, షిమ్యోను, లేవీ, యూదా, ఇశ్శాకారు, జెబూలూను, 2 దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు.3 ✝యూదా కొడుకులు: ఏర్, ఓనాను, షేలా. ఈ ముగ్గురు షూయ కూతురుకు జన్మించారు. ఆమె కనాను స్త్రీ. యూదాకు జ్యేష్ఠకుమారుడు ఏర్ యెహోవా దృష్టిలో చెడ్డవాడు గనుక ఆయన వాణ్ణి చావుకు గురి చేశాడు. 4 యూదా కోడలు తామారు అతనికి పెరెసునూ జెరహునూ కన్నది. యూదా కొడుకులందరూ అయిదుగురు. 5 ✝పెరెసు కొడుకులు: హెస్రోను, హామూల్. 6 ✝జెరహు కొడుకులు: జిమ్రీ, ఏతాను, హేమాను, కల్‌కోల్, దార. వారు అయిదుగురు. 7 కర్మీ కొడుకు: ఆకాను. అతడు నిషిద్ధమైన దానిలో కొంత తీసుకొని ఇస్రాయేల్ ప్రజలకు బాధ కలిగించాడు. 8 ఏతాను కొడుకు: అజరయా. 9 హెస్రోనుకు జన్మించిన కొడుకులు: యెరమేల్, రమ్, కెలూబై.
10 రమ్కు✽ అమ్మీనాబాద్ జన్మించాడు. అమ్మీనాబాద్‌కు నయస్సోను జన్మించాడు. అతడు యూదా ప్రజల నాయకుడు. 11 ✝నయస్సోనుకు శల్మాను జన్మించాడు. శల్మానుకు బోయజు జన్మించాడు. 12 బోయజుకు ఓబేదు జన్మించాడు. ఓబేదుకు యెష్షయి జన్మించాడు. 13 యెష్షయికి జన్మించిన వారు: మొదటివాడు ఏలీయాబ్, రెండోవాడు అబీనాదాబ్, మూడో వాడు షమ్మా, 14 నాలుగోవాడు నెతనేల్, అయిదోవాడు రద్దయి, 15 ఆరోవాడు ఓజెం, ఏడోవాడు దావీదు. 16 ✝వారి సోదరీలు: సెరూయా, అబీగయీల్. సెరూయా కొడుకులు ముగ్గురు: అబీషై, యోవాబ్, అశాహేల్. 17 ✝అబీగయీల్ అమాశాను కన్నది. ఇష్మాయేల్‌వాడైన యెతెరు అమాశాకు తండ్రి.
18 హెస్రోను కొడుకు కాలేబ్‌కు అతని భార్య అయిన అజూబా పిల్లలను కన్నది. అతనికి యెరీయోతు కూడా పిల్లలను కన్నది. అజూబా కొడుకులు: యేషెరు, షోబాబ్, అర్దోను. 19 అజూబా చనిపోయిన తరువాత కాలేబ్ ఏఫ్రాతాను పెళ్ళిచేసుకొన్నాడు. ఆమె అతనికి హూర్‌ను కన్నది. 20 హూర్‌కు ఊరి జన్మించాడు. ఊరికి బసెలేల్✽ జన్మించాడు. 21 తరువాత హెస్రోను మాకీరు కూతురుతో శయనించాడు. మాకీరు గిలాదుకు తండ్రి. హెస్రోను మాకీరు కూతురును పెళ్ళి చేసుకొన్నప్పుడు అతని వయసు అరవై ఏళ్ళు. ఆమె అతనికి సెగూబ్‌ను కన్నది. 22 సెగూబ్‌కు యాయీరు జన్మించాడు. యాయీరుకు గిలాదు ప్రదేశంలో ఇరవై మూడు ఊళ్ళు ఉన్నాయి. 23 ✝అయితే గెషూరు, అరాం యాయీరు ఊళ్ళనూ కెనాతునూ, కెనాతుకు చెందిన ఊళ్ళనూ – మొత్తం అరవై ఊళ్ళను – యాయీరువారి వశం నుంచి తీసుకొన్నారు. వీరందరూ గిలాదు తండ్రి మాకీరు సంతతివారు. 24 కాలేబ్ ఎఫ్రాతా అనే స్థలంలో హెస్రోను చనిపోయిన తరువాత అతని భార్య అయిన అబీయా అతనికి అష్షూరును కన్నది. అష్షూరు తెకోవకు తండ్రి.
25 హెస్రోనుకు మొదట పుట్టినవాడైన యెరమేల్ కొడుకులు: మొదటివాడు రమ్, బూనా, ఓరెను, ఓజెం, అహీయా. 26 అటారా అనే ఇంకొక భార్య యెరమేల్‌కు ఉంది. ఆమె ఓనాంకు తల్లి. 27 యెరమేల్‌కు మొదట పుట్టినవాడైన రమ్ కొడుకులు: మయజ్, యామిన్, ఏకెరు. 28 ఓనాం కొడుకులు: షమ్మయి, యాదా. షమ్మయి కొడుకులు: నాదాబ్, అబీషూర్. 29 అబీషూర్ భార్య పేరు అబీహాయిల్. ఆమె అతనికి అబానును, మొలీదును కన్నది. 30 నాదాబ్ కొడుకులు: సెలెదు, అప్పయీం. సెలెదు సంతానం లేక చనిపోయాడు. 31 అప్పయీం కొడుకు: ఇషీ. ఇషీకి షేషాను జన్మించాడు. షేషానుకు అలయి జన్మించాడు. 32 షమ్మాయి సోదరుడైన యాదా కొడుకులు: యెతెరు, యోనాతాను. యెతెరు సంతానం లేక చనిపోయాడు. 33 యోనాతాను కొడుకులు: పేలెతు, జాజా. వీరు యెరహెమేల్✽ సంతతివారు. 34 షేషానుకు కొడుకులు లేరు. కూతుళ్ళే జన్మించారు. షేషానుకు యరహా అనే ఒక సేవకుడు ఉన్నాడు. అతడు ఈజిప్ట్‌వాడు. 35 షేషాను తన కూతురును తన సేవకుడైన యరహాకు పెళ్ళి చేశాడు. ఆమె అతనికి అత్తయిని కన్నది. 36 అత్తయికి నాతాను జన్మించాడు. నాతానుకు జాబాదు జన్మించాడు. 37 జాబాదుకు ఎప్లాల్ జన్మించాడు. ఎప్లాల్‌కు ఓబేదు జన్మించాడు. 38 ఓబేదుకు యెహూ జన్మించాడు. యెహూకు అజరయా జన్మించాడు. 39 అజరయాకు హేలెస్సు జన్మించాడు. హేలెస్సుకు ఎలాశా జన్మించాడు. 40 ఎలాశాకు సిస్మాయీ జన్మించాడు. సిస్మాయీకి షల్లూం జన్మించాడు. 41 షల్లూంకు యెకమయా జన్మించాడు. యెకమయాకు ఎలీషామా జన్మించాడు.
42 యెరమేల్ తమ్ముడైన కాలేబ్ కొడుకులు: మారెషా, మొదటపుట్టినవాడు మేషా. మేషాకు జీపు జన్మించాడు. మారెషా హెబ్రోనుకు తండ్రి. 43 హెబ్రోను కొడుకులు: కోరహు, తప్పూయ, రేకెం, షెమ. 44 షెమకు రహం జన్మించాడు. రహంకు యోరకెయాం జన్మించాడు. రేకెంకు షమ్మయి జన్మించాడు. 45 షమ్మయి కొడుకు మాయోను. మాయోను బేత్‌సూర్‌కు తండ్రి. 46 కాలేబ్ ఉంపుడుకత్తె ఏయిఫాకు హారాను, మోజా, గాజేజ్ జన్మించారు. హారానుకు గాజేజ్ జన్మించాడు. 47 యెదయి కొడుకులు: రెగెం, యోతాం, గేషాను, పెలెట, ఏయిఫా, షయపు. 48 కాలేబ్ ఉంపుడుకత్తె మయకాకు షెబెరు, తిర్‌హనాను జన్మించారు. 49 ఆమెకు మద్‌మన్నా తండ్రి షయపు, మక్‌బేనా, గిబయాల తండ్రి షెవా కూడా జన్మించారు. కాలేబ్ కూతురు అక్సా. 50 కాలేబ్ సంతతివారు: ఎఫ్రాతాకు మొదట పుట్టిన హూర్✽ కొడుకులు శోబాల్, శల్మా, హారేపు. 51 శోబాల్‌కు కిర్యత్‌యారీం జన్మించాడు. శల్మాకు బేత్‌లెహేం జన్మించాడు. హారేపుకు బేత్ గాదేర్ జన్మించాడు. 52 కిర్యత్‌యారీం తండ్రి శోబాల్ సంతతివారు: హారోయే, మనుహోతువారిలో సగం మంది, 53 కిర్యత్‌యారీం కుటుంబాలు – ఇత్రీవారు, పూతీవారు, షుమ్మాతివారు, మిష్రాయీవారు. వీరివల్ల సొరాతివారు, ఎష్తాయుల్‌వారు కలిగారు. 54 షల్మా సంతతివారు: బేత్‌లెహేం, నెటోపాతివారు, అతారోతు, బేత్‌యోవాబ్, మనుహోతువారిలో సగంమంది, జారీవారు, 55 యబ్బేజులో కాపురమున్న లేఖకుల కుటుంబాలు – తిరాతివారు, షిమ్యాతివారు, శూకోతివారు. వీరు హమాతుకు కలిగిన కేనువారు✽. హమాతు రేకాబ్ వంశానికి ఆదిపురుషుడు.