1 దినవృత్తాంతాలు
1
1 ✽✽ఆదాము, షేతు, ఎనోషు, 2 కేయినాను, మహలలేల్, యెరెదు, 3 హనోకు, మెతూషెల, లెమెకు, 4 నోవహు, నోవహు కొడుకులు షేము, హాము, యాపెతు.5 యాపెతు కొడుకులు: గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాల్, మెషెకు, తీరసు. 6 గోమెరు కొడుకులు: అష్‌కనజు, రీఫతు, తోగర్మా. 7 యావాను కొడుకులు: ఎలీషా, తర్షీషు, కిత్తీం, దోదానీం.
8 హాము కొడుకులు: కూషు, మిస్రాయిం, పూతు, కనాను. 9 కూషు కొడుకులు: సెబా, హవీలా, సబ్తా, రాయమా, సబ్తకా. రాయమా కొడుకులు: షెబ, దదాను. 10 కూషుకు నిమ్రోదు జన్మించాడు. నిమ్రోదు భూమిమీద పరాక్రమశాలి అయ్యాడు. 11 మిస్రాయిం సంతతివారు: లూదీయవారు, అనామీయులు, లెహాబీయులు, నపతుహీయులు, 12 పత్రుసీయులు, ఫిలిష్తీయవాళ్ళ వంశకర్తలైన కసలూహీయులు, కఫతోరివారు, 13 కనానుకు మొదట పుట్టినవాడు సీదోను, తరువాత హేతు. కనాను సంతతివారు: 14 యెబూసి, అమోరీ, గిర్‌గాషి, 15 హివ్వి, అర్కి, సిని, 16 అర్వాది, సెమారి, హమాతి జాతులవారు.
17 షేము కొడుకులు: ఎలాం, అష్షూరు, అర్‌పక్షదు, లూదు, అరాం. అరాం కొడుకులు: ఊజు, హూల్, గెతెరు, మెషెకు, 18 అర్‌పక్షదుకు షేలహు జన్మించాడు. షేలహుకు ఏబెరు జన్మించాడు. 19 ఏబెరుకు ఇద్దరు కొడుకులు జన్మించారు. ఒకడి పేరు పెలెగు – ఎందుకంటే అతడి రోజుల్లో భూలోకం దేశాలుగా విభాగాలైంది. అతడి తోబుట్టువు యొక్తాను. 20 యొక్తానుకు జన్మించినవారు అల్‌మోదాదు, షెలపు, హసర్‌మావెతు, యెరహు, 21 హదోరం, ఊజాల్, దిక్లా, 22 ఏబాల్, అబీమాయేల్, షేబ, 23 ఓఫీరు, హవీలా, యోబాలు. వీరందరూ యొక్తాను కొడుకులు.
24 అబ్రాహాము వంశావళి: షేము, అర్‌పక్షదు, షేలహు, 25 ఏబెరు, పెలెగు, రయూ, 26 సెరూగు, నాహోరు, తెరహు, 27 ✽ అబ్రాము (అంటే, అబ్రాహాము). 28 అబ్రాహాము కొడుకులు: ఇస్సాకు, ఇష్మాయేల్. 29 వీరి సంతతివారెవరంటే, ఇష్మాయేల్‌కు మొదట పుట్టినవాడు నెబాయోతు, తరువాత కేదారు, అద్‌బేల్, మిబ్‌శాం, 30 మిష్మా, దూమా, మశ్శా, హదదు, తేమా, 31 యెతూర, నాపీషు, కెదెమా. వీరు ఇష్మాయేల్ కొడుకులు.
32 ✝అబ్రాహాము ఉంచుకొన్న స్త్రీ కెతూరాకు జన్మించిన కొడుకులు: జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు. యొక్షాను కొడుకులు: షేబ, దదాను, 33 మిద్యాను కొడుకులు: ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్ దాయా. వీరందరూ కెతూరా సంతతివారు.
34 అబ్రాహాముకు ఇస్సాకు జన్మించాడు. ఇస్సాకు కొడుకులు: ఏశావు, ఇస్రాయేల్✽. 35 ఏశావు కొడుకులు: ఏలీఫజు, రెయూవేల్, యెయూషు, యాలాం, కోరహు, 36 ఏలీఫజు కొడుకులు: తేమాను, ఓమారు, సెపో, గాతాం, కనజ్, తిమ్నా, అమాలేక్. 37 రెయూవేల్ కొడుకులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ. 38 శేయీరు కొడుకులు: లోతాను, శోబాల్, సిబ్యోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను. 39 లోతాను కొడుకులు: హోరీ, హోమాం, తిమ్నా లోతానుకు సోదరి. 40 శోబాల్ కొడుకులు: అల్వాను, మనహతు, ఏబాల్, షెపో, ఒనాం. సిబ్యోను కొడుకులు: అయా, అనా. 41 అనా కొడుకు: దిషోను. దిషోను కొడుకులు: హమ్రాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. 42 ఏసెరు కొడుకులు: బిల్‌హాను, జవాను, యహకాను. దిషాను కొడుకులు: ఊజ్, అరాను.
43 ఏ రాజూ ఇస్రాయేల్ ప్రజలను పరిపాలించకముందు కాలంలో ఎదోం✽లో ఈ రాజులు పరిపాలించారు: బెయోరు కొడుకు బెల. అతడి పట్టణం పేరు దిన్‌హాబా. 44 బెల చనిపోయిన తరువాత బొస్రా పట్టణంవాడూ జెరహు కొడుకూ అయిన యోబాబు అతడి స్థానంలో రాజయ్యాడు. 45 యోబాబు చనిపోయిన తరువాత తేమాను ప్రదేశంవాడు హుషాం అతడి స్థానంలో రాజయ్యాడు. 46 హుషాం చనిపోయిన తరువాత మోయాబు దేశంలో మిద్యాను వాళ్ళను ఓడించినవాడూ బెదెదు కొడుకూ అయిన హదదు అతడి స్థానంలో రాజయ్యాడు. అతడి పట్టణం పేరు అవీతు. 47 హదదు చనిపోయిన తరువాత మశ్రేకా ఊరివాడైన శమ్లా అతడి స్థానంలో రాజయ్యాడు. 48 శమ్లా చనిపోయిన తరువాత నది ఒడ్డున ఉన్న రెహబోతు ఊరివాడైన షావూల్ అతడి స్థానంలో రాజయ్యాడు. 49 షావూల్ చనిపోయిన తరువాత అక్బోరు కొడుకు బేల్‌హానాను అతడి స్థానంలో రాజయ్యాడు. 50 బేల్‌హానాను చనిపోయిన తరువాత హదదు అతడి స్థానంలో రాజయ్యాడు. అతడి పట్టణం పేరు పాయు. అతడి భార్య పేరు మెహేతబేల్. ఆమె మేజాహాబ్ మనుమరాలు, మత్రేదు కూతురు. 51 హదదు చనిపోయిన తరువాత ఎదోంలో ఉన్న నాయకులెవరంటే, తిమ్నా, అల్వా, యతేతు, 52 అహోలీబామా, ఏలా, పీనోను, 53 కనజ్, తేమాను, మిబ్‌సారు, 54 మగదీయేల్, ఈరాం. వీరు ఎదోం దేశానికి నాయకులు.