13
1 యరొబాం ధూపం వేయడానికి✽ ఆ బలిపీఠం దగ్గర నిలబడి ఉన్నాడు. అప్పుడే దేవుని మనిషి✽ ఒకడు యూదా✽ ప్రదేశం నుంచి వచ్చి బేతేల్ చేరాడు. యెహోవా మాట విని అతడు వచ్చాడు. 2 యెహోవా నుంచి వచ్చిన వాక్కు ప్రకారం అతడు ఆ బలిపీఠానికి వ్యతిరేకంగా ఇలా పలికాడు: “బలిపీఠమా! బలిపీఠమా! యెహోవా ఈ విధంగా చెపుతున్నాడు – దావీదు రాజ వంశంలో మగ శిశువు జన్మిస్తాడు. అతనికి యోషీయా✽ అనే పేరు పెడతారు. నీ మీద ధూపం వేసే ఎత్తయిన పూజాస్థలాల యాజులను అతడు నీ మీద వధిస్తాడు. మనుషుల ఎముకలను నీ మీద కాలుస్తాడు.”3 ✽ఆ వేళే ఆ మనిషి ఒక సూచన ఇచ్చాడు. “ఇప్పుడు ఈ పీఠం బ్రద్దలవుతుంది, దాని మీద ఉన్న బూడిద ఒలికిపోతుంది. యెహోవా చెప్పిన సూచన ఇదే” అన్నాడు.
4 బేతేల్‌లో ఉన్న ఆ బలిపీఠానికి వ్యతిరేకంగా దేవుని మనిషి పలికినది విని యరొబాంరాజు “అతణ్ణి పట్టుకోండి✽” అన్నాడు. బలిపీఠం మీద నుంచి అతడు చేయి చాపాడు. దేవుని మనిషివైపు చాపిన అతడి చేయి వెంటనే ఎండిపోయింది. తిరిగి దానిని వెనక్కు తీయడానికి అతడికి చేత కాలేదు. 5 అంతేగాక, యెహోవా వాక్కు అనుసరించి దేవుని మనిషి వెల్లడి చేసిన సూచన ప్రకారం బలిపీఠం బ్రద్దలైంది, దాని నుంచి బూడిద ఒలికిపోయింది. 6 అప్పుడు దేవుని మనిషితో రాజు, “నా చెయ్యి బాగయ్యేట్టు దయ చూపి నీ దేవుడు యెహోవాను అర్థించు, నా కోసం ప్రార్థించు✽” అన్నాడు.
దేవుని మనిషి యెహోవాను వేడుకొన్నాడు. రాజు చెయ్యి పూర్తిగా నయమై మునుపటివలె అయింది. 7 అప్పుడు రాజు దేవుని మనిషితో “నాతో నా ఇంటికి రా. అక్కడ సేద తీర్చుకో. నీకు బహుమానం✽ ఇస్తాను” అన్నాడు.
8 ✽రాజుతో దేవుని మనిషి ఇలా చెప్పాడు: “మీ ఇంట్లో సగం నాకిచ్చినా నేను మీతో లోపలికి రాను. అంతేగాక, ఈ స్థలంలో నేను భోజనం చేయను. నీళ్ళు త్రాగను. 9 ఎందుకంటే, యెహోవా నాకు ఇలా ఆజ్ఞాపించాడు – నీవు అక్కడ భోజనం చేయవద్దు. నీళ్ళు త్రాగవద్దు. వెళ్ళిన దారిన తిరిగి రావద్దు.”
10 అందుకని అతడు బేతేల్‌కు వచ్చిన దారిన తిరిగి వెళ్ళలేదు. ఇంకో దారిన వెళ్ళాడు.
11 ✽బేతేల్‌లో ఒక ప్రవక్త కాపురం ఉండేవాడు. అతడు ముసలివాడు. అతడి కొడుకులు వచ్చి ఆ వేళ ఆ దేవుని మనిషి బేతేల్‌లో చేసినదంతా అతనికి తెలియజేశారు. ఆ మనిషి రాజుతో చెప్పిన మాటలు కూడా వారి తండ్రికి చెప్పారు.
12 వారి తండ్రి “అతడు ఏ దారిన వెళ్ళాడు?” అని వారి నడిగాడు. యూదా నుంచి వచ్చిన ఆ దేవుని మనిషి వెళ్ళిన దారి అతడి కొడుకులు చూపించారు.
13 “గాడిద మీద జీను వేయండి” అని అతడు కొడుకులతో చెప్పాడు.
వాళ్ళు అతడి కోసం గాడిద మీద జీను వేశారు. అతడు గాడిదను ఎక్కి బయలుదేరాడు. 14 ఆ ప్రవక్త దేవుని మనిషి వెంటపడి అతడు సిందూర వృక్షం క్రింద కూర్చుని ఉండడం చూచి అతణ్ణి అడిగాడు:
“యూదా ప్రదేశం నుంచి వచ్చిన దేవుని మనిషివి నీవేనా?”
16 ✽ అతడు ఇలా బదులు చెప్పాడు: “నేను తిరిగి మీతో కూడా వెళ్ళి మీ ఇంట ప్రవేశించలేను. మీతో కలిసి ఈ స్థలంలో భోజనం గానీ నీళ్ళు గానీ పుచ్చుకోలేను. 17 ఎందుకంటే దేవుని నుంచి ఈ వాక్కు నాకు వచ్చింది: నీవు అక్కడ భోజనం చేయకూడదు. నీళ్ళు త్రాగకూడదు. నీవు వెళ్ళిన దారిన తిరిగి రావద్దు.”
18 ✽అతడు ఆ దేవుని మనిషితో “నీలాగే నేనూ ప్రవక్తనే. యెహోవా ఆజ్ఞననుసరించి ఒక దేవదూత నాతో ఇలా అన్నాడు – అతడు భోజనం చేసి నీళ్ళు త్రాగేట్టు అతణ్ణి తీసుకురా” అన్నాడు.
20 ✽వారు ఇంకా బల్ల దగ్గర కూర్చుని ఉండగానే ఆ మనిషిని తీసుకువచ్చిన ఆ ప్రవక్తకు యెహోవా నుంచి వాక్కు వచ్చింది. 21 ✽ అతడు యూదానుంచి వచ్చిన ఆ దేవుని మనిషితో ఇలా బిగ్గరగా చెప్పాడు:
“యెహోవా ఈ విధంగా చెప్తున్నాడు – నీవు యెహోవా మాట మీద తిరగబడ్డావు✽. నీ దేవుడు యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను శిరసావహించలేదు. 22 ✽భోజనం గానీ నీళ్ళు గానీ తీసుకోవద్దు అని ఆయన ఏ స్థలాన్ని గురించి ఆజ్ఞాపించాడో ఆ స్థలంలో నీవు భోజనం, నీళ్ళు తీసుకొన్నావు గనుక నీ శవం నీ పూర్వీకుల సమాధులకు చేరదు.”
23 వారు భోజనం చేసి నీళ్ళు త్రాగిన తరువాత అతడు వెనక్కు తీసుకువచ్చిన ఆ ప్రవక్తకోసం గాడిద మీద జీను వేశాడు. 24 ✽ఆ ప్రవక్త ప్రయాణమై వెళ్ళిపోతున్నాడు. త్రోవలో ఒక సింహం ఎదురై అతణ్ణి చంపింది. అతడి శవం త్రోవలోనే పడి ఉంది. దాని దగ్గర గాడిద నిలుచుంది. సింహం కూడా శవం దగ్గర నిలబడి ఉంది. 25 బాటసారులు కొందరు అక్కడ చేరి శవం దారిలో పడి ఉండడం, శవం దగ్గర సింహం నిలబడి ఉండడం చూశారు. వారు వెళ్ళి ఆ ముసలి ప్రవక్త కాపురం ఉంటున్న పట్టణంలో ఆ సంగతి చెప్పారు. 26 ✽మార్గం నుంచి అతణ్ణి వెనక్కు తీసుకువచ్చిన ఆ ముసలి ప్రవక్త ఆ వార్త విని, “అతడు యెహోవా మాట మీద తిరగబడిన దేవుని మనిషి. యెహోవా అతణ్ణి సింహానికి ఇచ్చాడు. యెహోవా అతనికి చెప్పిన వాక్కు ప్రకారం ఆ సింహం అతణ్ణి చీల్చి చంపింది” అన్నాడు.
27 అప్పుడతడు తన కొడుకులను పిలిచి “నా కోసం గాడిద మీద జీను వేయండి” అన్నాడు.
వారు అలా చేశారు. 28 అతడు వెళ్ళి దారిలో శవం పడి ఉండడం, శవం దగ్గర గాడిద, సింహం నిలబడి ఉండడం చూశాడు. సింహం శవాన్ని తిన్నది కాదు, గాడిదను చీల్చింది కాదు. 29 ✽ఆ ముసలి ప్రవక్త ఆ దేవుని మనిషి యొక్క శవాన్ని ఎత్తి గాడిద మీద వేసుకొన్నాడు, రోదనం చేయడానికీ శవాన్ని పాతిపెట్టడానికీ దానిని తన పట్టణానికి తీసుకువచ్చాడు, 30 తన సొంత సమాధిలో శవాన్ని ఉంచాడు. వారు “అయ్యో, సోదరా!” అంటూ శోకించారు. 31 శవాన్ని సమాధి చేసిన తరువాత అతడు కొడుకులతో ఇలా అన్నాడు:
“నేను చనిపోయినప్పుడు ఆ దేవుని మనిషిని ఉంచిన సమాధిలోనే నన్ను పాతి పెట్టండి. నా ఎముకలను అతడి ఎముకల దగ్గరే పెట్టండి. 32 ✝ఎందుకంటే బేతేల్‌లో ఉన్న బలిపీఠానికి వ్యతిరేకంగా, షోమ్రోను ప్రదేశ పట్టణాలలో ఉన్న ఎత్తయిన స్థలాల గుళ్ళన్నిటికీ వ్యతిరేకంగా యెహోవా వాక్కు ప్రకారం అతడు ప్రకటించినది తప్పక జరుగుతుంది.”
33 ఆ తరువాత కూడా యరొబాం తన దుర్మార్గాలు విడిచి పెట్టలేదు.✽ మరో సారి ఎత్తయిన పూజా స్థలాలకు సామాన్యులను యాజులుగా నియమించాడు. ఇష్టమున్న✽ వారందరినీ ఆ స్థలాలకు యాజులుగా ప్రతిష్ఠ చేశాడు. 34 యరొబాం యొక్క రాజ వంశాన్ని నిర్మూలించి✽ భూమిమీద లేకుండా నాశనం చేసిన పాపం ఇదే.