21
1 ✽దావీదు నోబులో ఉన్న అహీమెలెక్‌యాజి దగ్గరికి వెళ్ళాడు. అయితే దావీదు రాకడకు అహీమెలెక్ భయపడి, “మీరు ఒంటరిగా ఎందుకు ఉన్నారు? మీతో కూడా ఎవ్వరూ రాలేదేమిటి?” అని అడిగాడు.2 ✽అహీమెలెక్‌యాజికి దావీదు ఇలా జవాబిచ్చాడు: “రాజు నాకొక పని అప్పగించాడు. ‘నేను నీకు ఆదేశించి పంపిన విషయం ఎవ్వరికీ తెలియకూడదు’ అని నాతో చెప్పాడు. నేను పనివాళ్ళను నిర్ణయించిన స్థలంలో కలుసుకోవాలి. 3 ఇప్పుడు మీ దగ్గర ఏం ఉంది? అయిదు రొట్టెలు ఇవ్వండి. లేదా, ఇక్కడ ఉన్నదేదైనా ఇవ్వండి.”
4 ✽ యాజి “నాదగ్గర మామూలు రొట్టె లేదు. పవిత్రమైన రొట్టెలు మాత్రమే ఉన్నాయి. ఇటీవల పనివారు స్త్రీలకు✽ దూరంగా ఉంటే వాటిని తినవచ్చు” అని దావీదుతో చెప్పాడు.
5 అందుకు దావీదు అన్నాడు “నేను బయలుదేరిన కొన్ని రోజులనుంచి మేము స్త్రీలకు దూరంగా ఉన్నాం. సామాన్యమైన పనిమీద వెళితే కూడా నా పనివాళ్ళు పవిత్రంగా ఉంటారు. ఈరోజు మరింత పవిత్రంగా ఉన్నారు!”
6 ✽ వారి పద్ధతి ప్రకారం యెహోవా సన్నిధానం నుంచి సన్నిధి రొట్టెలను తీసివేసిన రోజున వాటి స్థానంలో వేడి రొట్టెలను ఉంచారు. అలా తీసివేసిన రొట్టెలు తప్ప వేరే రొట్టెలు లేనందువల్ల యాజి ఆ పవిత్రమైన రొట్టెలను దావీదుకు ఇచ్చాడు.
7 ✽ఆ రోజు సౌలు సేవకులలో ఒకడు అక్కడ యెహోవా సన్నిధానంలో ఉండవలసివచ్చింది. అతడి పేరు దోయేగు. అతడు ఎదోం దేశంవాడు, సౌలు కాపరులకు పెద్ద.
8 దావీదు “రాజుగారి పని చాలా అవసరంగా ఉండడంచేత హడావుడితో నా ఖడ్గం గానీ వేరే అయుధాలు గానీ నేను తీసుకురాలేదు. ఇక్కడ మీ దగ్గర ఖడ్గం ఉందా? లేదా, ఈటె ఉందా?” అని అహీమెలెక్‌ను అడిగాడు.
9 ✝యాజి “ఏలా లోయలో మీరు చంపిన ఫిలిష్తీయవాడు గొల్యాతు ఖడ్గం ఇక్కడ ఉంది. అది బట్టలో చుట్టివుండి ఏఫోదు వెనుక ఉంది. మీకు ఇష్టముంటే దాన్ని తీసుకోండి. అది తప్ప ఇక్కడ వేరే ఆయుధం లేదు” అన్నాడు.
దావీదు “అలాంటిది మరొకటి లేదు. అది నాకివ్వండి” అన్నాడు.
10 దావీదు ఆ రోజు సౌలునుంచి పారిపోయి గాతు✽ నగరం రాజైన ఆకీషు దగ్గరికి వెళ్ళాడు. 11 ✝ఆకీషు సేవకులు “ఇతడు దావీదు గదా. ఆ దేశం రాజు గదా. వాళ్ళు నాట్యమాడుతూ, గానప్రతిగానాలు చేస్తూ, ‘సౌలు వేలకొలది శత్రువులను హతం చేశాడు. దావీదు పది వేలకొలది శత్రువులను హతం చేశాడు’ అని పాడిన పాట ఇతడి విషయమే గదా” అన్నారు.
12 ఈ మాటలు దావీదు మనసులో నాటాయి, గనుక అతడు గాత్ రాజు ఆకీషుకు చాలా భయపడ్డాడు✽. 13 ✽అందుచేత అతడు వాళ్ళ ఎదుట తన ప్రవర్తన మార్చుకొని పిచ్చివాడులాగా నటించాడు, ద్వారం తలుపులమీద గీతలు తీస్తూ, ఉమ్మి తన గడ్డంపై కారనిస్తూ ఉన్నాడు.
14 ఆకీషు తన సేవకులతో ఇలా చెప్పాడు: “ఇదిగో, ఇతడు పిచ్చివాడు! నాదగ్గరికి వీణ్ణి ఎందుకు తీసుకువచ్చారు? 15 నాకు పిచ్చివాళ్ళ కొరత ఉందనా? పిచ్చిచేష్టలు చేయడానికి మరొకణ్ణి నా సమక్షంలోకి తీసుకువచ్చారేం! వీడు నా భవనంలోకి రావాలా?”