11
1 ✽అమ్మోను దేశంవాడైన నాహాషు వెళ్ళి యాబేష్ గిలాదును ముట్టడించాడు. యాబేష్‌వారంతా అతడితో, “మీరు మాతో సంధి చేసుకుంటే మేము మీకు సేవ చేస్తాం” అన్నారు.2 ✽అందుకు అమ్మోనువాడు నాహాషు “మీ అందరి కుడి కండ్లు పీకివేసి నేను ఇస్రాయేల్ ప్రజలందరికీ అవమానం కలిగిస్తాను. మీరు ఈ షరతుకు ఒప్పుకొంటేనే నేను మీతో సంధి చేసుకొంటాను” అని జవాబిచ్చాడు.
3 ✽యాబేష్‌వారి పెద్దలు “మేము ఇస్రాయేల్‌దేశమంతా రాయబారులను పంపడానికి ఏడు రోజులు గడువు ఇవ్వండి. మమ్మల్ని రక్షించడానికి ఎవ్వరూ రాకపోతే మేము మీకు లొంగిపోతాం” అని అతడితో చెప్పారు.
4 ✽సౌలు కాపురముంటున్న గిబియాకు రాయబారులు చేరుకొని ఆ సంగతి ప్రజలకు తెలియజేసినప్పుడు ప్రజలంతా గట్టిగా ఏడ్చారు. 5 ✽అప్పుడే పొలంనుంచి ఎద్దులను తోలుకువచ్చి సౌలు “ప్రజలెందుకు ఏడుస్తున్నారు?” అని అడిగాడు. యాబేష్‌వారు తెచ్చిన వార్తను వారు అతనికి చెప్పారు. 6 ✽సౌలు ఆ మాటలు విన్నవెంటనే దేవుని ఆత్మ బలీయంగా అతణ్ణి ఆవరించాడు. అతడు తీవ్ర కోపంతో మండిపడ్డాడు. 7 అతడు ఒక కాడి ఎద్దులను ముక్కలుగా నరికి రాయబారులచేత ఆ ముక్కలతో కూడా ఈ ప్రకటన✽ ఇస్రాయేల్ దేశమంతా పంపించాడు:
“యుద్ధానికి సౌలునూ సమూయేలునూ ఎవరు అనుసరించరో వాళ్ళ ఎద్దులను ఈ విధంగా చేస్తాం.”
అప్పుడు యెహోవా భయం✽ ప్రజలను ఆవరించింది, గనుక వారు ఒకటిగా వచ్చారు. 8 ✽సౌలు బెజెకులో వారిని లెక్కపెట్టాడు. మూడు లక్షలమంది ఇస్రాయేల్ మనుషులూ ముప్ఫయి వేలమంది యూదా మనుషులూ ఉన్నారు. 9 అప్పుడు వారు యాబేష్ రాయబారులతో “రేపు మధ్యాహ్నం లోపుగా మీకు విడుదల కలుగుతుందని యాబేష్ గిలాదు ప్రజలతో చెప్పండి” అన్నారు. రాయబారులు వెళ్ళి యాబేష్ ప్రజలకు ఈ సంగతి తెలియజేసినప్పుడు వారు సంతోషించారు. 10 యాబేష్‌వారు అమ్మోనువాళ్ళకు “రేపు మీకు లొంగిపోతాం. అప్పుడు ఏది మంచిదని మీకు తోస్తే ఆ విధంగా మమ్మల్ని చేయవచ్చు” అని చెప్పారు.
11 మరుసటి రోజు సౌలు తన మనుషులను మూడు గుంపులుగా విభజించాడు. వారు తెల్లవారు జామున✽ అమ్మోను వాళ్ళ శిబిరం మధ్యకు చొచ్చి మధ్యాహ్నం కాకముందు వాళ్ళను హతం చేశారు. వాళ్ళలో మిగిలినవాళ్ళు చెదిరి పోయారు. వాళ్ళలో ఏ ఇద్దరూ కలిసి తప్పించుకోలేకపోయారు.
12 ✝అప్పుడు ప్రజలు “సౌలు మనల్ని పరిపాలిస్తాడా? అని అడిగినవాళ్ళేరి? వాళ్ళను మాకు అప్పగించు, మేము వాళ్ళను చంపివేస్తాం” అని సమూయేలుతో చెప్పారు.
13 ✽కానీ సౌలు “ఈరోజు యెహోవా ఇస్రాయేల్ ప్రజలను రక్షించాడు గనుక ఇవ్వేళ మీరు ఎవరినీ చంపకూడదు” అన్నాడు.
14 ✽ సమూయేలు ప్రజలతో ఇలా అన్నాడు: “మనం గిల్గాల్‌కు వెళ్ళి రాజ్యపరిపాలనను క్రొత్తగా బలపరచుకొందాం, రండి.”
15 అందుచేత ప్రజలంతా గిల్గాల్‌కు వెళ్ళి అక్కడ యెహోవా సన్నిధానంలో సౌలుకు పట్టాభిషేకం చేశారు. అక్కడ యెహోవా సన్నిధానంలో వారు శాంతిబలులు✽ అర్పించారు. సౌలు, ఇస్రాయేల్ ప్రజలంతా సంతోషంతో ఉప్పొంగిపోయారు✽.