12
1 ✽అంతకుముందు మోషే కూషు జాతి స్త్రీని పెళ్ళి చేసుకొన్నాడు. అతడు వివాహమాడిన ఆ స్త్రీ విషయం మిర్యాం, అహరోను అతడికి విరోధంగా మాట్లాడారు. 2 “యెహోవా మాట్లాడించినది మోషేచేత మాత్రమేనా? మా చేత కూడా మాట్లాడించలేదా”? అన్నారు. వారు అన్నది యెహోవా విన్నాడు. 3 ✽(మోషే లోకనివాసులందరిలో చాలా సాధువైన మనిషి). 4 ✽ఉన్నట్టుండి యెహోవా మోషేతో, మిర్యాం అహరోనులతో “మీరు ముగ్గురూ సన్నిధిగుడారం దగ్గరికి రండి” అని చెప్పాడు. 5 వారు అక్కడికి వచ్చిన తరువాత యెహోవా మేఘస్తంభంలో దిగివచ్చి గుడారం ద్వారందగ్గర నిలిచి అహరోను మిర్యాంలను పిలిచాడు. వారిద్దరూ ముందుకు వచ్చాక యెహోవా ఇలా అన్నాడు:6 ✽“నేను చెప్పేది వినండి. మీ మధ్య యెహోవాయొక్క ప్రవక్త ఎవరైనా ఉంటే, అతడికి నేను దర్శనం✽లో నన్ను వెల్లడి చేసుకొంటాను. కలలో✽ అతడితో మాట్లాడుతాను. 7 ✝నా సేవకుడైన మోషేతో అలా కాదు. అతడు నా ఇంటి విషయాలన్నిటిలో నమ్మకంగా ఉన్నాడు. 8 నేను అతడితో ముఖాముఖిగా✽ మాట్లాడుతాను; గూఢంగా కాదు, స్పష్టంగానే మాట్లాడుతాను. అతడు యెహోవా ఆకారాన్ని చూచేవాడు. అలాంటప్పుడు నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదు?”
9 ✝యెహోవా కోపాగ్ని వారిమీద రగులుకొంది 10 ✽ యెహోవా వెళ్లిపోయాడు. అయితే మేఘం గుడారంమీదనుంచి పైకెక్కిపోగానే మిర్యాం చర్మవ్యాధితో హిమమంత తెల్లగా కనిపించింది. అహరోను మిర్యాంవైపు మళ్ళుకొని చూశాడు. ఆమెకు చర్మవ్యాధి ఉంది.
11 ✽అహరోను మోషేతో, “అయ్యో, స్వామీ, మేము తెలివితక్కువగా ప్రవర్తించి తప్పిదం చేశాం. అయినా ఈ దోషశిక్ష మామీద పెట్టకు. 12 తల్లి గర్భంలోనుంచి జీవం లేకుండా పుట్టి సగంమట్టుకు తినివేసిన శరీరమున్న శిశువులాగా ఆమెను ఉండనియ్యకు” అన్నాడు.
13 ✝మోషే యెహోవాకు మొరపెట్టి “దేవా, దయ ఉంచి ఈమెను బాగు చెయ్యి!” అన్నాడు.
14 ✽యెహోవా మోషేతో, “ఆమె తండ్రి ఆమె ముఖంమీద ఉమ్మివేసినా ఆమె ఏడు రోజులు సిగ్గుపడుతూ ఉండాలి. ఇప్పుడు ఆమెను శిబిరం బయట ఏడు రోజులు ఉంచాలి. ఆ తరువాత ఆమెను లోపలికి మళ్ళీ చేర్చవచ్చు” అని జవాబిచ్చాడు.
15 ✝గనుక మిర్యాం శిబిరం బయట ఏడు రోజులు గడిపింది. ఆమె లోపలికి మళ్ళీ చేరేవరకు ప్రజలు ప్రయాణంలో ముందుకు సాగలేదు. 16 ఆ తరువాత వారు హజేరోతును విడిచివెళ్ళి పారాను ఎడారిలో దిగారు.