కళ్యాణం కమనీయం
463
పల్లవి: కళ్యాణం కమనీయంఈ సమయం అతి మధురం-2
దేవా రావయ్య – నీ దీవెనలీవయ్యా-2
1 ఏదేను వనమున యెహోవ దేవా
మొదటి వివాహము చేసితివే-2
ఈ శుభ దినమున నవ దంపతులను-2
నీ దీవెనలతో నింపుమయా-2
2 కానా విందులో అక్కర నెరిగి
నీళ్ళను రసముగ మార్చితివే-2
కష్టములలో నీవే అండగ నుండి-2
కొరతలు తీర్చి నడుపుమయా-2
3 బుద్దియు జ్ఞానము సంపదలన్నియు గుప్తమైన్నవి నీ యందే-2
ఇహాపర సుఖములు మెండుగ నొసగి-2
ఇల వర్ధిల్లగా జేయుమయా -2 “దేవా రావయ్యా”