ఈ పెళ్లికార్యము దేవుడు ఏర్పరచేను
453
పల్లవి: ఈ పెళ్లికార్యము దేవుడు ఏర్పరచేనుకూడివచ్చిన మనమంతా..పాడిస్తుతించెదము -2
1 సీయోను రారాజు దిగివచ్చిన వేళ..
నూతన వధువరులన్ దీవించేవేళ-2
ఒంటరిగా ఉన్న వీరిని జంటగా మార్చిన దేవుడు
క్షేమ క్షామ కాలమందు తోడుగా ఉండెది దేవుడు-2
పిల్లపాపలతో కలసి చల్లగా ఉండునట్లు -2
దీవించే ఈ రోజు..జతచేసే మన ముందు-2 “సీయోను”
2 పురుషుని సహాయరాలుగా వధువు సంఘ ప్రతిబింబముగా
భర్త మేలు కోరె స్త్రీ వై భార్యగా ఉండాలి-2
జీవితములో ఒకే పెళ్లి రాదు మళ్ళి మళ్ళి-2
నువ్వు పిలిచే ఈ రోజు ముడివేసే రారాజు “సీయోను”
3 భయభక్తితో జీవించి ధ్యానించుడి
ప్రభు వాక్యం ఆదర్శ కుటుంబమై మాదిరిగా జీవించండి-2
సంఘము అనే బడిలో చేరి-సాగించుడి సంసారం
ప్రభుయేసే నీ తోడు నిన్ను విడువడు ఎడబాయడు-2 “సీయోను”