యేసు నామమున్‌ చాటెదము
441
పల్లవి: యేసు నామమున్‌ చాటెదము
అందు మనకు జయము జయమే
హల్లెలూయా.. హల్లెలూయా..
1 అన్ని నామముల కన్న పైనున్న నామం
అత్యున్నతమైన అద్బుత నామం (2)
కష్ట నష్టనారోగ్యములన్నీ వీడిపోవును
దుఃఖ జీవితము సంతోషమయ మగును
నూతన జీవమిచ్చును - నిరంతరము నడుపును
నిరంతరము నడుపును (2) “యేసు”
2 అన్ని నామముల కన్న బలమైన నామం
మహాత్యముగల ఘన నామం (2)
అందధకార శక్తులు వణికిపరిపోవును
సాతాను దుర్గములు పడఃద్రోయబడును
నూతన బలమిచ్చును - జయజీవితము నిచ్చును(2) “యేసు”