మానవ నేత్రాలకూ
440
పల్లవి: మానవ నేత్రాలకూ కనిపించనిదీ మహాఘని
మనో నేత్రానికే కనిపించే ఆ ఘని బైబిలని (2)
బైబిలంటే మత గ్రంధం కాదని..
మహా జ్ఞానమిచ్చె ఘనియని
మనస్సు పెట్టి చదివితే దానిని
మహాత్ములుగా మిగిలిపోతారని(2)“మానవ”
1 మాటవల్ల కలిగింది ప్రపంచం
ఆ మాటే క్రీస్తేసు నిజం నిజం(2)
శరీరాన్ని ధరించే సిలువపైన మరణించి(2)
సమాధినే గెలిచేను యేసు
సజీవుడై లేచేను క్రీస్తు(2)“మానవ”
2 లోకంలో ఉన్నదంతా దేవుని జ్ఞానం
దానికై వెతికితే అజ్ఞానం (2)
జ్ఞానానికి మూలం దేవుడని మరచి(2)
వెర్రితలలు వేస్తుందీ లోకం
ఎటో వెళ్ళిపోతుందీ ప్రపంచం(2)“మానవ”