ఏ తల్లి తండ్రులైన తమ పిల్లలకు
439
పల్లవి: ఏ తల్లి తండ్రులైన తమ పిల్లలకు వాక్యాన్ని నేర్పారా?
ఏ దైవ భక్తుడైన తమ పిల్లలకు వాక్యంలో పెంచారా?
యేసుక్రీస్తుగా పెంచాలని అపొస్తలలుగా పెరగాలని
దేవుని కోసం పెంచాలని ఈ మనసే లేదా
మీ పిల్లలతో కలసి నరకనికి వెలిపోతారా? “ఏ తల్లి”
1 కొడే తన పిల్లలను జాగ్రతగా పెంచుతుంది
తన బ్రతుకే నీకోసమని మరణించే తెలుపుతుంది
దేవుని కోసం పెంచాలనే ఈ మనసే మీకే లేదా?
బ్రతుకిచ్చిన దేవుని మరచి మీ కోసమే బ్రతుకుతారా?
మీ పిల్లలతో కలసి నరకానికి వెలిపోతారా? “ఏ తల్లి”
2 హన్నా సమూయేలునే దేవునికే ఇవ్వ లేదా?
ఆ దేవుడే బలి కోరితే అబ్రహామే ఇవ్వలేదా?
ఆ దేవుని కోసం ఇవ్వాలనే ఈ మనసే మీకే లేదా?
కట్నాలిచ్చి పిల్లలకే పెల్లిల్లే చేయలేదా?
ఆ దేవుడు మీ కోరకే తన పిల్లలనే ఇవ్వలేదా? “ఏ తల్లి”