దేవుడున్నాడు
438
పల్లవి: దేవుడున్నాడు ఛాలెంజ్‌
దేవుడున్నాడు ఛాలెంజ్‌ {4}
1 ప్రకృతిని పరుగులు తీయిస్తూ
విశ్వాన్ని ఉరకలు వేయిస్తూ
కాలాలకు క్రమాన్నే నేర్పించి
తన దయనే వర్షంగా కురిపించే(2) “దేవుడు”
2 సృష్టినంత వెతుకుచున్న మనుష్యులు
తమకు తాము తెలియన్ని అమాయకులు (2)
సృష్టి ఎలాపుట్టిందో చేతనైతే చెప్పు
దానికదే ఉందనుట నువు చేసే తప్పు(2)
ప్రజల వెనుక ప్రభుత్వాలే ఉన్నాయి(2)
సృష్టి వెనుక ప్రభుయేసే ఉన్నాడు
అయానే సృష్టిని నిర్మించాడు“దేవుడు”
3 శ్రమ శక్తితో చంద్రునిపై పండించలేవు
ఉదయాన్నే సూర్యుడిని రప్పించలేవు(2)
క్రమం తప్పకుండా కదులుతుంది విశ్వం
కన్నతండ్రి దేవుడే కదిలిస్తున్నది నిజం(2)
రాత్రిని పగలును ఏర్పచలేవు
కాలాలు రుతువులు నువు రమ్మంటే రావు(2) “దేవుడు”