ప్రేమించానని అనకు ప్రేమిస్తూనే ఉండు
429
పల్లవి: ప్రేమించానని అనకు ప్రేమిస్తూనే ఉండుప్రేమిస్తున్నాననకు - ప్రభు ఆజ్ఞను పాటించు
యేసు ప్రేమలో దాగియున్నది తండ్రి ఆజ్ఞగైకొనుటె
తండ్రి ఆజ్ఞలో దాగియున్నది నిన్ను వలె
నీ పొరుగు వారని ప్రేమించుటయే
1 ప్రేమ అన్నది ఆత్మఫలము - ఆత్మయే మన దేవుడు
ప్రేమ కప్పను దోషములను - కూల్చివేయును పాపములను
పరమునుండి పరిశుద్ధుడేసును- భువికి పంపినది ఆ ప్రేమ
శిరస్సు వంచి పలు శిక్షలన్నిటిని - సిలువ పై మోసే ఆప్రేమ
పరలోకాము భూ లోకము కమ్మెను ఈ ప్రేమ
పరిశుద్ధులకు పాపులకు కావాలి ఈ ప్రేమ
యేసు ప్రేమే శాశ్వతప్రేమ - తండ్రి గుణమే యేసుని ప్రేమ
సదానిలుచును ఈ ప్రేమ ”ప్రేమ”
2 ప్రేమ కోరును కనికరమును-బలిని కోరదు తండ్రి ప్రేమ
ప్రేమకలిగెను క్షమాగుణమును - తండ్రి చిత్తమును నెరవేర్చును
మలిన మనుజులను మహిమవాసులుగ-మార్చువేయును ఆ ప్రేమ
సృష్టి అంతటిలో శ్రేష్టమైనది సర్వము గెలిసెను ఆప్రేమ
యేసయ్యకు యెహోవకు కలిగిన ఈ ప్రేమ
తన జనులను పరమునకు చేర్చును ఈ ప్రేమ
పరిశుద్ధాత్మని మహిమే ప్రేమ - స్వస్ధతనిచే శక్తే ప్రేమ
సదానిలుచును ఈ ప్రేమ “ప్రేమ”