పాపపు నేత్రములు తొలిగించుము నా దేవా
428
పల్లవి: పాపపు నేత్రములు-తొలిగించుము నా దేవాపరిశుద్ధ హృదయమును-కలిగించుము నాలోన (2)
1 అపవాధి తంత్రముచే-నే నలచితి సొలచితిని (2)
అపవాధినెదిరింప-నను నడుపుము నా దేవా (2) “పాప”
2 అదిగో నరకాగ్ని వేచియున్నది-పాపుల కొరకే (2)
ఆ బాధను భరియింప లేరయ్యా-నా ప్రభువా (2) “పాప”
3 నీ రక్తము చేతనే- నా పాపములన్నీటిని(2)
పవిత్ర పరుచుమయా-పరిశుద్ధుని చేయుమయా (2) “పాప”
4 స్తుతియించేదను దేవా-నా పాప క్షమాపణకై (2)
స్తుతియించి పాడేదను- నీ మహిమను చాటేదను (2) పాప