సృష్టి కర్తవైన యెహోవా
420
పల్లవి: సృష్టి కర్తవైన యెహోవా
నీ చేతి పనియైన నాపై ఎందుకింత ప్రేమ
మంటికి రూపమిచ్చినావు-మహిమలో స్థానమిచ్చినావు
నాలో నిన్ను చూశావు-నీలో నన్ను దాచావు
నిస్వార్దమైన నీ ప్రేమ-మరణము కంటె బలమైనది నీ ప్రేమ
1 ఏ కాంతి లేని నిశీధిలో-ఏ తోడు లేని విషాదపు వీధులలో
ఎన్నో అపాయపు అంచులలో-నన్నాదుకున్న నా కన్న తండ్రివి
యేసయ్యా నను అనాధగ విడువక
నీలాంజనములతో నాకు పునాదులు వేసితివి“సృష్టి”
2 నిస్సారమైన నా జీవితములో-నిట్టూర్పులే నను దినమెల్ల వేదించగా
నశించిపోతున్న నన్ను వెదికి వచ్చి-నన్నాకర్షించిన ప్రేమ మూర్తివి
యేసయ్యా నను కృపతో బలపరచి
ఉల్లాస వస్త్రములను నాకు ధరింపజేసితివి“సృష్టి”