నా హృదయములో
419
పల్లవి: నా హృదయములో నీ మాటలేనా కనులకు కాంతి రేఖలు
కారు చీకటిలో కలువరి కిరణమై
కటిన హృదయమును కరిగించినావు
నీ కార్యములను వివరింపతరమా?
నీ ఘనకార్యములు వర్ణింపతరమా?
1 మనస్సులో నెమ్మది కలిగించుటకు
మంచువలె కృప కురిపించితివి
విచారములు కొట్టివేసి-విజయానందముతో నింపినావు
నీరుపారేటి తోటగా చేసి-సత్తువగల భూమిగా మార్చినావు“నీ కార్యము”
2 విరజిమ్మె ఉదయకాంతిలో
నిరీక్షణ ధైర్యము కలిగించి
అగ్నిశోధనలు జయించుట-మహిమాత్మతో నింపినావు
ఆర్పజాలని జ్వాలగా చేసి దీపస్తంబముపై నను నిలిపినావు“నీ కార్యము”
3 పవిత్రరాలైన కన్యకగా-పరిశుద్ధ జీవితం చేయుటకు
పావన రక్తముతో కడిగి-పరమానందముతో నింపినావు
సిద్ద పడుతున్న వధువుగా చేసి-సుగుణాల సన్నిధిలో ననునిలిపినావు“నీ కార్యము”