నీ కృప నిత్యముండును
416
పల్లవి: నీ కృప నిత్యముండును -నీ కృప నిత్యజీవము
నీ కృప వివరింప నా తరమా యేసయ్యా?
నీతిమంతుల గుడారాలలో
వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము
1 శ్రుతివున్న పాటలకు విలువలువున్నట్లె
కృతజ్ఙతనిచ్చావు కృపలోనిలిపేవు
కృంగిన వేళలో ననులేవనెత్తిన చిరునామ నీవేగా“నీ కృప”
2 ప్రతిచరణము వెంట పల్లవివున్నట్లె
ప్రతిక్షణమున నీవు పలుకరించావు
ప్రతికూలమైన పరిస్థితులన్నియు కనుమరుగైపోయెనే “నీ కృప”
3 అనుభవ అనురాగం కలకాలమున్నట్లె
నీ రాజ్యనియమాలలో నిలువనిచ్చావు
రాజమార్గములో ననునడుపుచున్న రారాజువు నీవేగా “నీ కృప”