చూచుచున్న దేవుడవు
415
పల్లవి: చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా
చూడముచ్చటాయెనే సుకుమార సుమములైన
నీ నేత్రాలంకృతము
1 పశ్చాత్తాపము కలుగునే-నీ దయగల చూపులతో
క్షమించబడుదురు ఎవరైనా-రక్తప్రోక్షణతో
ఆప్యాయతకు నోచుకొనని నను చేరదీసిన కృపాసాగరా! “చూచుచున్న”
2 అగ్నిజ్వాలామయమె నీ చూపులవలయాలు
తప్పించుకొందురా? ఎవరైనా ఎంతటిఘనులైనా!
అగ్నివంటి శోధనలు తప్పించితివే దయాసాగరా “చూచుచున్న”