ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను
414
పల్లవి: ఎన్నెన్నో మేళ్లను అనుభవించిన నేను
ఏమని ఎన్నని వివరించగలను
యుగయుగాలలో ఎన్నెన్నో-అనుభవించవలసిన నేను
ఆపౌరుత్వము కొరకే పోరాడుచున్నాను
1 స్వార్దప్రియులు కానరాని-వెయ్యేండ్ల పాలనలో
స్వస్థబుద్ది గలవారే-నివసించే రాజ్యమది
స్ధాపించునే అతిత్వరలో-నా యేసు ఆ రాజ్యమును
చిత్తశుద్దిగలవారె-పరిపాలించే రాజ్యమది “ఎన్నెన్నో”
2 భూనివాసులందరిలో-గొర్రెపిల్ల రక్తముతో
కొనబడినవారున్న-పరిశుద్దుల రాజ్యమది
క్రీస్తుయేసు మూలరాయియై-అమూల్యమైన రాళ్ళమై
ఆయనపై అమర్చబడుచు-వృద్ధినొందుచు సాగెదము“ఎన్నెన్నో”