ఎవరు సమీపించలేని
413
పల్లవి:ఎవరు సమీపించలేని-తేజస్సులో
నివసించు నా యేసయ్యా
నీ మహిమను ధరించిన పరిశుద్ధులు
నా కంటబడగానే ఏమౌదునో నేనేమౌదునో
1 ఇహలోక బంధాలు మరచి-నీ యెదుటే నేను నిలిచి
నీవిచ్చు బహుమతులునే స్వీకరించి
నిత్యానందముతో పరవశించు వేళ
ఏమౌదునో-నేనేమౌదునో “ఎవరు”
2 పరలోక మహిమను తలచి-నీపాద పద్మములపై ఒరిగి
పరలోక సైన్యసమూహాలతో కలిసి
నిత్యారాధన నే చేయు ప్రశాంతవేళ
ఏమౌదునో-నేనేమౌదునో “ఎవరు”
3 జయించిన వారితో కలిసి-నీ సింహాసనము నే చేరగా
ఎవరికి తెలియని ఓ క్రొత్తపేరుతో
నిత్యమహిమలో నను పిలచే ఆ శుభవేళ
ఏమౌదునో-నేనేమౌదునో “ఎవరు”