షారోను వనములో
417
పల్లవి: షారోను వనములో పూసిన పుష్పమైలోయలలో పుట్టిన వల్లీపద్మమునై
నీ ప్రేమాతిశయమునే నిత్యము కీర్తించుచు
ఆనందమయమై నన్నె మరచితిని
1 సుకుమారమైన వదనము నీది
స్ఫటికము వలె చల్లనైన హృదయము నీది
మధురమైన నీ మాటల సవ్వడి వినగా
నిన్ను చూడ ఆశలెన్నో మనసు నిండెనే
ప్రభువా నిన్ను చేరనా“షారోను”
2 సర్వోన్నతమైన రాజ్యము నీది
సొగసైన సంబరాల నగరము నీది
న్యాయమైన నీ పాలన విధులు చూడగా
నిన్ను చేర జనసంద్రము ఆశ చెందునే
ప్రభువా నిన్ను మరతునా“షారోను”
3 సాత్వీకమైన పరిచర్యలు నివి
సూర్యకాంతిమయమైన వరములు నీవి
పరిమళించు పుష్పమునై నిన్ను చూపనా
ప్రీతి పాత్రనై భువిలో నిన్నే చాటనా
ప్రభువా కృపతో నింపుమా“షారోను”