అత్యున్నత సింహాసనము
407
పల్లవి: అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా
దేవదూతలు ఆరాధించు పరిశుధ్దుడా
యేసయ నా నిలువెల్ల నిండియున్నావు
నా మనసార నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెద
1 ప్రతి వసంతము నీ దయాకిరీటమే
ప్రకృతి కళలన్నియు నీ మహిమను వివరించునే
ప్రభువా నిన్నే ఆరాధించెద-కృతజ్ఙతార్పణలతో“అత్యున్నత”
2 పరిమళించునే నా సాక్ష్యజీవితమే
పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే
పరిశుద్దాత్మలో ఆనందించెద-హర్షధ్వనులతో “అత్యున్నత”
3 పక్షిరాజువై నీ రెక్కలపై మోసితివే
నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే
యెహోవా నిన్నే మహిమపరచెద-స్తుతిగీతాలతో“అత్యున్నత”