నేను యేసుని చూచే సమయం
408
పల్లవి: నేను యేసుని చూచే సమయం-బహు సమీపమాయాయెనేశుభప్రదమైన యీ నిరీక్షణతో-శ్రుతి చేయబడెనే నా జీవితం
1 అక్షయ శరీరముతో-ఆకాశ గగనమున
ఆనందభరితనై-ప్రియయేసు సరసనే పరవశించెదను“నేను”
2 రారాజు నా యేసుతో వెయ్యేండ్లు పాలింతును
గొఱ్ఱెపిల్ల సింహము ఒక చోటనే కలిసి విశ్రమించును“నేను”
3 అక్షయ కిరీటముతో అలంకరింపబడి
నూతన షాలేములో నా ప్రభు యేసుతో ప్రజ్వరిల్లెదను“నేను”