ఎవరికి చెప్పాలి నా బాదను
406
పల్లవి: ఎవరికి చెప్పాలి నా బాదనుఏమని చెప్పాలి నా రోదనము
ఊరికి భయటనే నున్నననీ
నా వారే నన్ను విడిచారనీ(2)
1 బాదపడి ఉన్నాను నా రోగముతో
ఉన్నదంత పోసను నా రోగముకై(2)
కట్ట లేదయ్యా నా రక్తస్రావము
నన్ను విడువ లేదయ్యా నా పాప రోగము(2)“ఎవరికి”
2 భయపడి ముట్టను-నా యేసుని చెంగును
నాధుని ప్రభావము నాలో ప్రవహించేను(2)
కట్టిందయ్యా నా రక్తస్రావము
నన్ను విడిచిందయ్యా నా పాప రోగము(2)“ఎవరికి”
3 లోకంలో మరెవ్వరూ లేరన్నాను
నా యేసు నాధుడే ఉన్నాడనీ తెలియక(2)
నా పాప రహితుడా-నీకు స్తోత్రములయ్యా
నా ప్రాణ నాధుడా నీకు వందనములయ్యా(2)“ఎవరికి”