నమ్మి నమ్మి-మనుష్యులను
405
పల్లవి: నమ్మి నమ్మి-మనుష్యులను నీవు నమ్మి నమ్మిపలుమార్లు మోసపోయావు
ఇలా ఎంతకాలము-నీవు-సాగిపోదువు
1 రాజులను నమ్మి-బహుమతిని ప్రేమించిన
బిలాము ఏమాయెను?-దైవదర్శనం కోల్పోయెను
నా యేసయ్యాను నమ్మిన యెడల
ఉన్నత బహుమానము నీకు నిశ్చయమే “నమ్మి నమ్మి”
2 ఐశ్వర్యము నమ్మి-వెండి బంగారము ఆశించిన
ఆకాను ఏమాయెను?-అగ్నికి ఆహుతి ఆయెను
నా యేసయ్యాను నమ్మిన యెడల
మహిమైశ్వర్యము నీకు నిశ్చయమే“నమ్మి నమ్మి”
3 సుఖ భోగము నమ్మి-ధనాపేక్షతో పరుగెత్తిన
గెహజీ ఏమాయెను?-రోగమును సంపాదించెను
నా యేసయ్యను-నమ్మినయెడల
శాశ్వతమైన ఘనత నీకు నిశ్చయమే “నమ్మి నమ్మి”