లయమైపోవును
402
పల్లవి: లయమైపోవును లోకములో-నేను పడకుండా
నిత్యము నన్ను నీ ఆత్మలో నింపి నిరూపించుము- యేసు
ఓ యేసయ్యా-నీవే నా మార్గము“లయమై”
1 నీ మాట చేత నను బ్రతికించి -జివమునిచ్చితివి
నా హృదయముతో నిన్ను ప్రేమించి నీకై నిలిచితిని(2)
మరణముపై విజయము నిచ్చి నా భయమును తీర్చుమయా-యేసు“ఓ యేస”
2 మానవులంతా నను విడిచిననూ నాతో నీవుంటివి
పాపము మాని పరము చేర-నిన్నే కోరితిని(2)
నీ వెలుగులో నే నడుచుటకు-కాపరివై నడిపించుము“ఓ యేస”
3 నీ దాసులకై దివి నుండి-భువికి వెగమే రానుంటివి
ప్రత్యెక పరచి నీ చిన్న మందలో-నన్ను చేర్చుము(2)
నన్ను నీకే సమర్పించి నేడే నీ యందు ఆనందింతును“ఓ యేస”