యూదా స్తుతిగోత్రపు
401
పల్లవి: యూదా స్తుతిగోత్రపు సింహమా
యేసయ్యా నా ఆత్మీయప్రగతి నీ స్వాధీనమా
నీవేకదా నా ఆరాధనా
ఆరాధనా స్తుతి ఆరాధనా-ఆరాధనా స్తుతి ఆరాధనా
1 నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఙ మార్చింది నీవేనని
అహమును అణచి అధికారులను అధముల జేసిన నీకు
అసాధ్యమైనది ఏమున్నది-అసాధ్యమైనది ఏమున్నది?“యూదా”
2 నీ నీతికిరణాలకై నా దిక్కుదెసలన్నీ నీవేనని
అనతి కాలాన ప్రథమఫలముగా పక్వపరచిన నీకు
అసాధ్యమైనది ఏమున్నది-అసాధ్యమైనది ఏమున్నది“యూదా”
3 నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని
అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీకు
అసాధ్యమైనది ఏమున్నది-అసాధ్యమైనది ఏమున్నది“యూదా”