మహిమతో రాజా
403
పల్లవి: మహిమతో రాజా-మహిమతోడ-వేగముగా వచ్చునుగా
ఆ..ఆ..ఆనందమే-ఆనందమే-ఆనందమే-మహా ఆనందమే(2)
1 భూమి ఆకాశములు-ఆనందించు చుండగా(2)
భూర ధ్వనితోడ-శీగ్రామే ఏతెంచగా(2)
క్రీస్తు ప్రేమలో ఉండిన మనకు-ఆనందమానందమే“మహిమతో”
2 ప్రకాశమైనట్టియు-నిర్మలమైనట్టియు(2)
పరిశుద్దత తోడ- వస్త్రముల్‌ దరియించగా(2)
యేసుకై వేచియుండిన మనకు- ఆనందమానందమే“మహిమతో”
3 పరిశుద్దాత్మయును-పెండ్లి కుమార్తెయును(2)
రమ్మని పిలవగానే-రాకా సమీంపమని(2)
పెండ్లి కుమార్తెగా ఉండిన మనకు ఆనందమానందమే“మహిమతో”