నీవే నాకు చాలును యేసు
391
పల్లవి: నీవే నాకు చాలును యేసు (2)
నీవే నాకు చాలును యేసు {4}
1 ఒంటి నిండ బంగారమున్నను-అవి నీకు చాటి రాగలవా (2)
నా బంగారము నీవే యేసయ్యా..(2) “నీవే”
2 మేడ మిద్దెలు ఎన్నిఉన్నను-అవి నీకు చాటి రాగలవా (2)
నా మేడంతా నీవే యేసయ్యా..(2) “నీవే”
3 కోట్లు కోట్లుగా ధనమున్నను అది నీకు చాటి రాగలదా(2)
నా ధనమంత నీవే యేసయ్యా.. “నీవే”
4 బందు మిత్రులు ఎందరున్నాను వారు నీకు చాటి రాగలరా (2)
నా బందువుడా నీవే యెసయ్యా..(2) “నీవే”
5 స్నేహితులు ఎందరున్నను-వారు నీకు చాటి రాగలరా(2)
నా స్నేహితుడా నీవే యేసయ్యా..(2) “నీవే”
6 అధికారులు ఎందరున్నను-వారు నీకు చాటి రాగలరా(2)
నా అధికారి నీవే యేసయ్యా..(2) నీవే