స్తోత్రము స్తుతి చేల్లింతుము నీకే
390
పల్లవి: స్తోత్రము స్తుతి చేల్లింతుము నీకే సత్య దేవుడాయుగయుగాలకు ఆధారమా నీవే అద్వితీయుడా
నీవే మార్గం..నీవే జీవం..నీవే సత్యం..నీవే సర్వం (2) “ స్తోత్ర”
1 మరణమైనను ఎర్రసముద్రమైనను-నీ తట్టు నాకుంటే భయమేలనో
శత్రు సైన్యమే నా ఎదుట నిలిచినా-శత్రుయెడ బలమైనకోట నీవేగా (2)
నా దుర్గమా..నా శైలమా..నా ఆతిశయమా..నా ఆనందమా(2) “స్తోత్ర”
2 హింస అయినను ఎట్టి నిందలైనను-నీ చల్లని రెక్కలే నా ఆశ్రయం
చీకటైనను అగాధమైనను-నీ కృప కిరణమై వెలుగు మార్గము (2)
నీతి సూర్యడా.. మా పోషకుడా..మా వైద్యుడా..మా మంచి కాపరి(2) “స్తోత్ర”