మహిమ ప్రభునకే ఘనత ప్రభునకే
392
పల్లవి: మహిమ ప్రభునకే-ఘనత ప్రభునకేస్తుతులు వందన స్తోత్రములు-పరిశుద్ద ప్రభునకే
ఆరాధన...ఆరాధన (2)
నా ప్రియుడు యేసునకే-నా ప్రియుడు దేవునికే (2)
1 అమ్యూల్యమైన నీ రక్తముతో విడుదల నిచ్చితివి
రాజులవలె యాజకులవలె-నీకై పిలిచితివి(2) “మహిమ”
2 వెలుగుగా త్రోవన్ తోడైయుండి-నడిపించు దైవమా
ప్రేమ శక్తితో అగ్నితో వెలిగించు-అభిషేకనాధుడా (2) మహిమ
3 ఏవేళ ఉన్నటి రాబోవునట్టి మా గొప్ప రాజువు
నీ నామం హెచ్చును నీ రాజ్యం వచ్చున్ నీ చిత్తం నెరవేరున్ (2) “మహిమ”