విశ్వాస వీరుడా కదలిరా
388
పల్లవి: విశ్వాస వీరుడా కదలిరా
ప్రభు యేసయ్యా సిలువ వార్త చాటరా
సాతాను నెదిరించు-సహానము పాటించు(2)
చేతులు జోడించు ప్రేమను చూపించు(2)
1 హింసకాండలలో-ఇబంది కొలిమిలలో
ఊపిరే ఊదిన-ప్రాణమే పోయిన(2)
ఈ ప్రేమ చావదు-సువార్త ఆగదు హల్లెలూయా “విశ్వాస”
2 అగ్ని రగిలిన వేదన కలిగిన
సాతాను చేలరేగి దాడులు చేసిన
ఈ ప్రేమ చావదు-సువార్త ఆగదు(2)
హల్లెలూయా-అల్లెలూయా(2) “విశ్వాస”
3 కాలమే మారిన ఖడ్గమే ఎదురాడిన
నింగి నేల ఏకముగా కమ్ముకొనిన(2)
ఈ ప్రేమ చాటేదాన్‌-నీ బాట సాగేదాన్‌
హల్లెలూయా-అల్లెలూయా(2) “విశ్వాస”