విజయగీతము మనసార
353
పల్లవి: విజయగీతము మనసార నేను పాడెదనా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు(2)
పునరుత్థానుడా నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన(2)
1 ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్యజీవముకే
పుటమువేసితివే నీ రూపము చూడ నాలో
యేసయ్యా నీ తీర్మానమే
నను నిలిపినది నీ ఉత్తమమైన సంఘములో “విజయ”
2 ఒకని ఆయష్షు-ఆశీర్వాదము నీ వశమైయున్నవి
నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో
యేసయ్యా నీ సంకల్పమే
మహిమైశ్వర్యము నీ పరిశుద్దులలో చూపినది“విజయ”
3 నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు
ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో
యేసయ్యా నీ ఆదీపత్యమే
అర్హత కలిగించే నీ ప్రసన్నవదనమును ఆరాధించ “విజయ”