నా నోట క్రొత్త పాట
354
పల్లవి: నా నోట క్రొత్త పాట - నా యేసు ఇచ్చెనుఆనందించెదను ఆయననే పాడెదన్
జీవిత కాలమంతా - హల్లెలూయా
1 పాపపు బురద నుండి - లేవనెత్తెను
జీవమార్గమున నన్ను - నిలువబెట్టెను “ఆనంది”
2 తల్లితండ్రి బందుమిత్ర - జీవమాయనే
నిందను భరించి ఆయన - మహిమన్ చాటెదన్ “ఆనంది”
3 వ్యాది బాధలందు నన్ను - ఆదుకొనెను
కష్టనష్టముల్ తొలగించి - శుద్ధీకరించెను “ఆనంది”
4 ఇహలోక శ్రమలు - నన్నేమి చేయును
పరలోక జీవితమునే - వాంఛించెను “ఆనంది”