ఎగురుచున్నది విజయపతాకం
352
పల్లవి: ఎగురుచున్నది విజయపతాకం
యేసురక్తమే మా జీవిత విజయం
రోగ దుఃఖ వ్యసనములను తీర్చివేయును
సుఖజీవనం చేయుటకు శక్తినిచ్చును
రక్తమే-రక్తమే-రక్తమే-యేసురక్తమే
రక్తమే జయం యేసు రక్తమే జయం
1 యేసుని నామం నుచ్చరింపగనే
సాతాను సైన్యము వణకుచున్నది
వ్యాధుల బలము నిర్మూలమైనది
జయం పొందెడి నామము నమ్మినప్పుడు“రక్తమే”
2 దయ్యపు కార్యాలను గెలిచిన రక్తం
ఎడతెగకుండగ మనము స్మరణ చేయుదం
పాపపు క్రియలన్నిటిని చెదరగొట్టిన
క్రీస్తుని సిలువను మనము అనుసరించెదం“రక్తమే”
3 మా ప్రేమ వైద్యుడా ప్రాణనాధుడా
ప్రీతితోను నీ హస్తము చాపుము దేవా
నీ పాదపద్మముపై చేరియున్న ప్రజలను
స్వస్థపరచు తండ్రి ఈ క్షణమందే“రక్తమే”