మీ అందరికి శుభకాంక్షలు
342
పల్లవి: మీ అందరికి శుభకాంక్షలు-క్రీస్తుయేసు జన్మదినం
ఈ లోకానికే శుభ దినం (2)
హపి క్రీస్‌మాస్‌-మేరి క్రీస్‌మాస్‌ (2) “మీ అంద”
1 ఏడాది గడిచిననూ-తోడుగా నిలిచిన దేవా
మా పాపలు పెరిగిననూ-మా ప్రాణాలు నిలిపిన దేవా (2)
నీ ప్రేమకు వెల లేదు-నీ కరుణను మాపై చూపుమా (2) “మీ అంద”
2 రాబోవు కాలములో-రక్షణ నొసగుము దేవా
మా జీవిత కాలమే ముగుయునేమో ఇలాలోనా (2)
నీ సన్నిధి చేరుటకు మార్గమును తెరువుమా (2) “మీ అంద”
3 నీ రాకడ సమయములో-నిను చేరుట ధన్యత మాకు
రాజుల రాజుగా-నిను కొలుచుట దీవేనా మాకు (2)
నీ మార్గము చల్లనీదీ-నీ రాజ్యమే ఆనందం(2) “మీ అంద”